Begin typing your search above and press return to search.

చిన్నారి 'గంగోత్రి' ఎంతగా మారిందో చూడండి

By:  Tupaki Desk   |   24 July 2021 12:30 AM GMT
చిన్నారి గంగోత్రి ఎంతగా మారిందో చూడండి
X
మెగా హీరో అల్లు అర్జున్‌ హీరోగా పరిచయం అయిన గంగోత్రి సినిమా లో హీరోయిన్‌ గా అదితి అగర్వాల్‌ నటించింది. ఆ సినిమాలో చిన్నారి గంగోత్రిగా నటించిన పాప అప్పట్లో అందరి మనసుల్లో నిలిచింది. వైవిధ్యభరితమైన కళ్లు.. ముద్దు ముద్దు మాటలు పలికిన ఆ చిన్నారి గంగోత్రి పేరు కావ్యా కళ్యాణ్‌ రామ్‌. గంగోత్రిలో మాత్రమే కాకుండా పవన్‌ కళ్యాణ్ బాలు సినిమాలో కూడా నటించి మెప్పించింది. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్‌ కే కౌంటర్ ఇచ్చే చిచ్చర పిడుగా కనిపించింది. గంగోత్రి సినిమా నుండి మొదలుకుని ఎన్నో సినిమాల్లో కనిపించిన బేబీ కావ్యా ఇప్పుడు ముద్దుగుమ్మ కావ్యాగా మారింది. అప్పుడు చిన్నారిగా కనిపించిన కావ్యా ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది.

ఇన్ స్టా గ్రామ్‌ లో ఈమె ఫొటోలు ఈమద్య కాలంలో తెగ హడావుడి చేస్తున్నాయి. ఇన్నాళ్లు చదువుతో బిజీగా ఉన్న కావ్యా ప్రస్తుతం చదువు ముగింపు దశకు రావడంతో సినిమాల్లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తుంది అంటూ ఆమద్య సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. ఆ విషయమై కావ్యా నుండి ఎలాంటి స్పందన రాలేదు. కావ్యా హీరోయిన్‌ గా నటించాలని కోరుకుంటున్న వారు చాలా మందే ఉన్నారు.

బాల నటిగా నటించి హీరోయిన్ గా పేరు దక్కించుకున్న వారు చాలా మంది ఉన్నారు. కనుక బేబీ కావ్యా కూడా హీరోయిన్‌ కావ్యాగా మారి కొత్త ఇన్నింగ్స్ ను మొదలు పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇందుకోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా నెట్టింట టాక్ ను చూస్తుంటే అర్థం అవుతుంది. సినిమాల్లో ఇంట్రెస్ట్‌ ఉండటం వల్లే కావ్యా సోషల్‌ మీడియాలో అంత యాక్టివ్‌ గా ఉంటుందని.. ఆమె నుండి ఇప్పుడు కాకున్నా త్వరలో అయినా సినిమా ప్రకటన ఆశించవచ్చు అంటున్నారు. సోషల్‌ మీడియాలో ఆమె ఫొటోలు చూసి చాలా మంది ఆమెను సంప్రదిస్తున్నారు. కాని ఆమె నుండి స్పందన రావడం లేదని కొందరు అంటున్నారు.