Begin typing your search above and press return to search.

వైరల్ వీడియో: రోడ్ సైడ్ కాకా హోటల్ లో టిఫిన్ చేసిన బన్నీ..!

By:  Tupaki Desk   |   13 Sep 2021 11:30 AM GMT
వైరల్ వీడియో: రోడ్ సైడ్ కాకా హోటల్ లో టిఫిన్ చేసిన బన్నీ..!
X
సినిమా స్టార్స్ - సెలబ్రిటీలు రోడ్డు పక్కన ఉండే చిన్న కాకా హోటళ్లలో టిఫిన్ చేయడం ఎప్పుడైనా చూశారా? అయినా లగ్జరీ లైఫ్ గడిపే స్టార్స్ కి కి రోడ్ సైడ్ హోటల్ లో తినాల్సిన పరిస్థితి ఎందుకు ఉంటుంది? దాని కోసం స్టార్స్ ఉన్న హోటళ్లకు వెళ్తారు అనుకుంటున్నారు కదా?. అయితే ఇప్పుడు వీటన్నిటికీ జవాబు చెబుతూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ చిన్న హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు.

వివరాల్లోకి వెళితే.. అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప' సినిమా షూటింగ్ కోసం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ అటవీ ప్రాంతంలో కొన్ని యాక్షన్ సీన్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బన్నీ సోమవారం తన టీమ్ తో కలిసి గోకవరం ఏజెన్సీ ఏరియా మీదుగా ప్రయాణిస్తూ.. మార్గమధ్యంలో రోడ్డు పక్కన ఉన్న కాకా హోటల్ వద్ద ఆగి టిఫిన్ చేశారు.

అల్లు అర్జున్ టిఫిన్ చేసి బయటకు వస్తూ.. హోటల్ యజమానికి డబ్బులిస్తున్న దృశ్యాలను అభిమానులు తమ మొబైల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో బన్నీ అక్కడి నుంచి వెళ్లిపోతూ హోటల్ అతనికి బై చెప్తూ కనిపిస్తున్నాడు. ఇందులో అల్లు అర్జున్ సాదాసీదాగా ఓ టీ షర్ట్ - షార్ట్ లో కనిపిస్తున్నారు. ఇది చూసిన ఫ్యాన్స్ 'బన్నీ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్' అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

కాగా, బన్నీ - సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న 'పుష్ప' చిత్రాన్ని శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా పార్ట్-1 ''పుష్ప: ది రైజ్'' పేరుతో డిసెంబర్ లో విడుదల కానుంది. ఈ పాన్ ఇండియా సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.