20 మందికి వచ్చినా బన్నీ.. రష్మిక తప్పించుకున్నారు

Tue Jul 27 2021 08:00:01 GMT+0530 (IST)

Allu Arjun and Rashmi Mandanna escaped from dengue

దర్శకుడు సుకుమార్ డెంగ్యూ ఫీవర్ తో బాధ పడుతున్న విషయం తెల్సిందే. ఆయన మెల్ల మెల్లగా కోలుకుంటున్నారు. నేటి నుండి పుష్ప సినిమా షూటింగ్ ను పునః ప్రారంభించారు. సుకుమార్ అనారోగ్య సమస్యల కారణంగా సినిమా షూటింగ్ ను కొన్ని రోజుల పాటు క్యాన్సిల్ చేశారు. ఎట్టకేలకు పుష్ప షూటింగ్ ప్రారంభం అయిన నేపథ్యంలో మీడియా వర్గాల్లో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. హైదరాబాద్ లో ఒక లొకేషన్ లో చిత్రీకరణ చేస్తున్న సమయంలో సుకుమార్ డెంగ్యూ బారిన పడ్డాడట. ఆ సమయంలో సుకుమార్ మాత్రమే కాకుండా యూనిట్ లో దాదాపుగా 20 మందికి డెంగ్యూ పాజిటివ్ వచ్చిందట.ఒకే సారి అంత మందికి డెంగ్యూ పాజిటివ్ రావడంతో షూటింగ్ స్పాట్ లో ఏదైనా తేడా జరిగి ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంటే షూటింగ్ స్పాట్ లో డెంగ్యూ ను కలుగజేసే దోమలు ఏమైనా వారిపై దాడి చేసి ఉంటాయేమో అంటున్నారు. సుకుమార్ సహా ఇరవై మందికి డెంగ్యూ బాధ తప్పలేదు. కాని అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్నాలు మాత్రం డెంగ్యూ నుండి తప్పించుకున్నారని యూనిట్ సభ్యులు నేడు చర్చించుకుంటూ ఉన్నారు. మీడియా వారితో ఆ విషయాన్ని ఆఫ్ ది రికార్డ్ మాట్లాడటం జరిగిందట.

బన్నీ మరియు రష్మికలు వారి కార్ వ్యాన్ లో ఉండటం వల్ల దోమల బెడద నుండి తప్పించుకుని ఉంటారు. తద్వార వారికి డెంగ్యూ ఎటాక్ కాలేదని వారు అనుకుంటున్నారట. మొత్తానికి హీరో హీరోయిన్ మినహా మొత్తం యూనిట్ సభ్యులు డెంగ్యూ బారిన పడి కోలుకున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగానే ఉందని.. ఎవరికి కూడా సీరియస్ కాకుండా నార్మల్ జ్వరం లా వచ్చి పోయిందట. షూటింగ్ పునః ప్రారంభం అయిన నేపథ్యంలో బన్నీ మరియు రష్మికలు మళ్లీ జాయిన్ అయ్యారు. ఈ సినిమా రెండు పార్ట్ లుగా విడుదల కాబోతుంది. మొదటి పార్ట్ షూటింగ్ మరి కొన్ని రోజుల్లో ముగించబోతున్నారు.