Begin typing your search above and press return to search.

ముఖ్యమంత్రిగా బన్నీ అదరగొట్టనున్నాడా...?

By:  Tupaki Desk   |   21 July 2020 5:43 PM GMT
ముఖ్యమంత్రిగా బన్నీ అదరగొట్టనున్నాడా...?
X
అల్లు అర్జున్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహి వి రాఘవ్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మహి వి రాఘవ్ ఇంతకముందు ఏపీ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ఆధారంగా చేసుకుని 'యాత్ర' అనే సినిమా తీసి ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇప్పుడు బన్నీకి పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఓ స్టోరీ లైన్ రాఘవ్ చెప్పాడని.. స్టోరీ లైన్ నచ్చిన బన్నీ కంప్లీట్ స్క్రిప్ట్ రెడీ చేయమని కోరినట్లుగా న్యూస్ స్ప్రెడ్ అయింది.

కాగా మహి వి రాఘవ్ ఈ స్టోరీని ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని హీరో పాత్ర డిజైన్ చేసారని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా సీఎంగా ప్రజాసంక్షేమానికి పాటు పడే ఆ క్యారక్టర్ కి కమర్షియాలిటీ జోడించి రూపొందించబోతున్నారట. అల్లు అర్జున్ ఇప్పటి వరకు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు.. సెటిల్డ్ పెర్ఫార్మన్స్ పాత్రలు పోషించలేదనే చెప్పవచ్చు. ఇప్పుడు వస్తున్న వార్తలు నిజమైతే బన్నీకి కూడా ఇదో ఛాలెంజింగ్ రోల్ అవుతుంది. గతంలో యాక్షన్ కింగ్ అర్జున్ 'ఒకే ఒక్కడు'.. దగ్గుబాటి రానా 'లీడర్'.. సూపర్ స్టార్ మహేష్ బాబు 'భరత్ అనే నేను' సినిమాలలో ముఖ్యమంత్రి పాత్రలలో నటించి మెప్పించారు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తారేమో చూడాలి.

ఇదిలా ఉండగా అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి జోడీగా లక్కీ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న 'పుష్ప' సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.