ఫొటోటాక్ : నిజమైన విజయానందం

Tue Jan 21 2020 17:35:10 GMT+0530 (IST)

Allu Arjun Thanks to His dad

సంక్రాంతికి 'అల వైకుంఠపురంలో' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ హిట్ ను అందుకున్నాడు. ఇన్ని రోజులు లోటుగా ఉన్న ఇండస్ట్రీ టాప్ చిత్రాల జాబితాలో బన్నీ తన పేరును ఈ చిత్రంతో చేర్చేశాడు. సంక్రాంతి విన్నర్ అంటూ అభిమానులు ప్రకటించగా బన్నీ కూడా ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నట్లుగా మొన్నటి సక్సెస్ వేడుకలో చెప్పుకొచ్చాడు. ఇక నిన్న పలు ట్వీట్స్ తో తన సంతోషాన్ని నెటిజన్స్ తో పంచుకున్నాడు. ట్విట్టర్ లో పలు ట్వీట్స్ చేసి సక్సెస్ తాలూకు ఆనందాన్ని తన ఫాలోవర్స్ తో షేర్ చేసుకున్నాడు.సక్సెస్ వేడుకకు చెందిన ఈ ఫొటోను షేర్ చేసిన బన్నీ... ఇది నిజమైన సక్సెస్ దక్కించుకున్న సమయంలో వచ్చే నవ్వు. ఈ ఆనందం లోపలి నుండి వచ్చిందని అన్నాడు. ఈ ఆనందంకు కారణం ప్రేక్షకులు మమ్ములను ఆశీర్వదించడమే. మీ ఆశీర్వాదంకు కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశాడు. ఇంతటి గొప్ప విజయాన్ని అందించినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ మరో ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇక మరో ట్వీట్ లో త్రివిక్రమ్ ను హగ్ చేసుకున్న ఫొటోను పోస్ట్ చేసి త్రివిక్రమ్ పై ప్రశంసలు కురిపించాడు. మీతో వర్క్ చేయడం గొప్ప అనుభూతిని కలిగించింది అంటూ బన్నీ ట్వీట్ చేశాడు.

అల్లు అర్జున్.. త్రివిక్రమ్ ల కాంబోలో వచ్చిన జులాయి మరియు సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు హిట్ అయ్యాయి. ఈ చిత్రంతో హ్యాట్రిక్ దక్కించుకుంటారని ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేశారు. అయితే హ్యాట్రిక్ మాత్రమే కాకుండా బ్లాక్ బస్టర్ ను కూడా ఈ కాంబో దక్కించుకుందంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వంద కోట్లను క్రాస్ చేసిన ఈ చిత్రం కలెక్షన్స్ జోరు కంటిన్యూ అవుతూనే ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.