Begin typing your search above and press return to search.

స్క్రిప్టు ఛేంజెస్.. బ‌న్ని స‌ల‌హాలు నిజ‌మా?

By:  Tupaki Desk   |   11 Oct 2019 7:00 AM GMT
స్క్రిప్టు ఛేంజెస్.. బ‌న్ని స‌ల‌హాలు నిజ‌మా?
X
ద‌ర్శ‌క‌నిర్మాత‌లు- ర‌చ‌యిత‌ల‌తో పాటుగా క‌థానాయ‌కుడు సినిమా కూర్పులో ఎంతో కీల‌కం. హీరో ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌తో పాటుగా స్క్రిప్టు డిస్క‌ష‌న్ లో ఉంటారు. స్క్రిప్టు మొత్తం విని అందులో త‌న‌కు ఏం న‌చ్చిందో ఏం న‌చ్చ‌లేదో చెప్పే హ‌క్కు అందులో న‌టించే హీరోకి ఉంటుంది. అయితే న‌చ్చ‌లేదు అని చెబితే ఫింగ‌రింగ్ చేసిన‌ట్టు భావించాలా? త‌న మ‌న‌సుకు న‌చ్చ‌కుండానే న‌టించేయాలా? అంటే.. అదెలా సాధ్యం..?

అందుకే మ‌న స్టార్ హీరోలు స్క్రిప్టు ద‌శ‌లోనే ఇటీవ‌ల ఎంతో జాగ్ర‌త్త‌గా ఉంటున్నారు. మారిన ట్రెండ్ లో సినిమాని ఏదో ఒక‌లా చుట్టేసి రిలీజ్ చేసేస్తామంటే కుద‌ర‌డం లేదు. స్క్రిప్టు బావుండాలి. ఎమోష‌న్ కుద‌రాలి. ప్ర‌తి స‌న్నివేశం తెర‌కెక్క‌క ముందే అది ఎలా ఉందో ఇమాజినేట్ చేయాలి. అలా ఇమాజిన్ చేసిన‌ది తెర‌పై య‌థాత‌థంగా రావాలి. లేదా ఇంకా బాగా రావాలి. బాగా లేదంటే ప్రేక్ష‌కులు నిర్ధ‌య‌గా తిర‌స్క‌రిస్తున్నారు. అయితే ఇలాంటి విష‌యంలోనే బ‌న్ని ఎక్కువ శ్ర‌ద్ధ చూపించ‌డాన్ని వేలు పెట్ట‌డంగా ప్ర‌చారం చేస్తున్నారు కొంద‌రు.

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో త్వ‌ర‌లో సెట్స్ కెళ్ల‌నున్న సినిమాకి స్క్రిప్టు రెడీ అవుతోంది. అయితే ఫైన‌ల్ వెర్ష‌న్ విన్న త‌ర్వాత అందులో ద్వితీయార్థం క‌థాంశాన్ని మార్చాల‌ని బ‌న్ని సూచించార‌ట‌. దాంతో సుక్కూ మ‌రో వెర్ష‌న్ రాస్తున్నారు అంటూ ప్ర‌చార‌మ‌వుతోంది. ఇది నిజ‌మా? అని ఆరాతీస్తే.. అస‌లు బ‌న్ని స్క్రిప్టు విష‌యంలో వేలు పెట్టిందే లేదని తెలుస్తోంది. సుకుమార్ కి ఇది చెయ్.. అది చెయ్ అంటూ ఆయ‌న సూచించింది కూడా ఏమీ లేదు. బ‌న్ని పూర్తిగా అల వైకుంఠ‌పురంలో షూటింగ్ బిజీలోనే ఉన్నారు. ప్ర‌స్తుతం త‌న దృష్టి అంతా ఈ సినిమాపైనే అని వెల్ల‌డైంది.