Begin typing your search above and press return to search.

అలా రోడ్డుపై వాకింగ్ చేస్తున్న అల హీరో!

By:  Tupaki Desk   |   2 Jun 2020 6:50 AM GMT
అలా రోడ్డుపై వాకింగ్ చేస్తున్న అల హీరో!
X
సెలబ్రిటీలు రోడ్డుమీద కనిపిస్తే ఏమౌతుంది? సాధారణమైన సెలబ్రిటీల సంగతేమో కానీ అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు కనిపిస్తే మాత్రం జనాలు గుమికూడతారు. సెల్ఫీల కోసం ఎగబడతారు. అందుకే స్టార్ హీరోలు పెద్దగా బయటకు అడుగు పెట్టరు అయితే ఈమధ్య అల్లు ఆర్జున్ ఒకసారి అలా బయటకు వచ్చారు. అలా నడుస్తూ ఉంటే తీసిన ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

ఈ ఫోటోలో వైట్ షర్టు.. షార్టు ధరించిన అల్లు అర్జున్ నడుస్తూ ఉన్నారు. ఆయనకు తోడుగా బౌన్సర్లు కూడా ఉండడం విశేషం. గుబురు గడ్డంతో.. పెంచిన జుట్టుతో 'పుష్ప' సినిమా లుక్ లో అల్లు అర్జున్ కనిపిస్తున్నారు. గతంలో అయితే ఇలా బయటకు రావడం కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు మహమ్మారి దెబ్బకు రోడ్లమీద జన సంచారం తగ్గింది. అందుకే అల్లు అర్జున్ కూడా అలా సరదాగా బయట నడవగలిగారు. అయితే అల్లు అర్జున్ ఈ ఫోటోలో మాస్క్ ధరించలేదు.

ఏప్రిల్ లో అల్లు అర్జున్ ఇలానే ఒకసారి ఓ సూపర్ మార్కెట్ కు వెళ్లి సరుకులు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి పుణ్యమా అని సెలబ్రిటీలు అడుగు బయట పెట్టగలుగుతున్నారని అనుకోవాలేమో.