అల్లు వారసురాలు వేగంగానే ఎదిగేస్తోంది!

Sun Jul 05 2020 11:30:51 GMT+0530 (IST)

Allu Arjun Shares His Daughter Pic

సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ గా అల్లు అర్జున్ సుపరిచితం. ఫేస్ బుక్ లో దాదాపు కోటి 30లక్షల ఫాలోవర్స్ ని... ఇన్ స్టాగ్రమ్ వేదికపై 70 లక్షల ఫాలోవర్స్ ని కలిగి ఉన్నారు. ఈ వేదికపై అభిమానులకు బోలెడన్ని అప్ డేట్స్ అందుతుంటాయి. అక్కడ బోలెడంత డిబేట్ జరుగుతుంటుంది.ఇక అల్లు అర్జున్ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు.. వీడియోలు ఇక్కడ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా చిన్నారులు అల్లు అయాన్..  అల్లు అర్హకు సంబంధించిన ఫోటోలు.. వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాల్లోకి దూసుకెళ్లాయి. తమ ప్యామిలీలో ఇంపార్టెంట్ ఈవెంట్లకు సంబంధించిన ఫోటోల్ని అల్లు అర్జున్ ఇంతకుముందు షేర్ చేశారు. అల్లరి గడుగ్గాయ్ అల్లు అర్హ అల్లరి వేషాలకు సంబంధించిన ఫోటోలు వీడియోల్ని విరివిగానే షేర్ చేస్తుంటారు. వాటికి ఫ్యాన్స్ లో రియాక్షన్ అదిరిపోతుంది.

తాజాగా అల్లు అర్హ తమ ఇలాకాలో ఇదిగో ఇలా మెట్లపై కూచుని టాప్ వైపు చూస్తూ ఉన్న ఫోటోని బన్ని షేర్ చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. పసుపు వర్ణం ఫ్రాకులో చిరునవ్వులు చిందిస్తూ క్యూట్ గా లవ్ లీగా కనిపిస్తోంది అర్హ. తన కుమార్తె అర్హ వివిధ దశలు ఆసక్తికరం. ప్రతి దశలో తన అడుగులకు సంబంధించిన మధుర క్షణాల్ని అభిమానులతో పంచుకునేందుకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏమాత్రం సంకోచించరు. తాజా ఫోటోకి ``హ్యాపీనెస్ లైస్ ఇన్ బేబీ స్టెప్స్`` అన్న క్యాప్షన్ ని ఇచ్చారు బన్ని.

ఇక బన్ని నటించిన `అల వైకుంఠపురములో` ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్  `పుష్ప` కోసం సన్నాహకాల్లో ఉన్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. రష్మిక మందన.. విజయ్ సేతుపతి.. ప్రకాష్ రాజ్ తదితరులు ఈ చిత్రంలో నటించనున్నారు. తెలుగు- హిందీ- తమిళం- కన్నడ- మలయాళ భాషలలో పుష్ప చిత్రాన్ని రిలీజ్ చేయాలన్నది ప్లాన్.