Begin typing your search above and press return to search.

స్టైలిష్ స్టార్ హాయ్ చెప్పారిలా..ఇంట్లోనే పూర్తి సుర‌క్షితం!

By:  Tupaki Desk   |   7 May 2021 6:32 AM GMT
స్టైలిష్ స్టార్ హాయ్ చెప్పారిలా..ఇంట్లోనే పూర్తి సుర‌క్షితం!
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గ‌త కొంత‌కాలంగా స్థ‌బ్ధుగా ఉన్న సంగ‌తి తెలిసిందే. పుష్ప చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో అత‌డికి కోవిడ్ సోక‌డంతో వెంట‌నే గృహ‌నిర్భంధంలోకి వెళ్లారు. మైల్డ్ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డాక చికిత్స మొద‌లైంది. అత‌డు కోలుకున్నాడా లేదా? .. ఇదిగో ఈ సందేహానికి స‌మాధానం ఈ వీడియోనే.

ఇంట్లోనే బ‌న్ని సుర‌క్షితంగా ఉన్నారు. కుటుంబ స‌భ్యులు వైద్యుల బృందం అత‌డిని ఎంతో జాగ్ర‌త్త‌గా చూసుకున్నారు. ఇటీవ‌లే అల్లు అర్హ కిచెన్ లో దోసెలు వేస్తూ త‌న తండ్రికి అందిస్తున్న క్యూట్ వీడియో వైర‌ల్ అయ్యింది. డాడీకి అన్నీ తానే అయ్యి ఆ చిన్నారి వండి పెట్ట‌డం అంద‌రి హృద‌యాల్ని తాకింది.

తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త‌న ఇంటి టెర్రాస్ పై నుంచి అభిమానుల‌కు హాయ్ చెబుతున్న వీడియోని శిరీష్ షేర్ చేయగా అది వైర‌ల్ గా మారింది. నేను ఇంట్లోనే క్షేమం. చికిత్స తో కోలుకుంటున్నా.. మీరు కూడా ఇంట్లోనే ఉండండి అని బ‌న్ని సందేశం ఇచ్చిన‌ట్టే దీన‌ర్థం. దీంతో అభిమానుల‌కు ఇప్పుడు ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఇక సుకుమార్ త‌దుప‌రి పుష్ప షెడ్యూల్ కోసం మ‌రికాస్త స‌మ‌యం వేచి చూడాల్సి ఉంటుంది. సెకండ్ వేవ్ ఉధృతి త‌గ్గాకే సెట్స్ కెళ్లే అవ‌కాశం ఉంది.