పుష్ప పాటల గురించి శరత్ చంద్ర ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Sat Jul 31 2021 12:09:13 GMT+0530 (IST)

Sarath Chandra Interesting Comments About Puspa Songs

అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబోలో రూపొందుతున్న పుష్ప సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. వీరి కాంబోల ఇప్పటికే వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో పాటు మ్యూజికల్ హిట్ గా కూడా నిలిచాయి. కనుక పుష్ప సినిమా పాటలపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించబోతున్న నేపథ్యంలో పుష్ప పాటల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుండి పాటల గురించి చర్చ జరుగుతోంది. ఎందుకంటే బన్నీ గత చిత్రం అల వైకుంఠపురంలో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమాలోని పాటలు ఏడాది పాటు ట్రెండ్ అయ్యాయి. ఇప్పటికి కూడా ఆ సినిమా పాటలను శ్రోతలు అధికంగా వింటూనే ఉన్నారు.అల వైకుంఠపురంలోని పాటలను మించి పుష్ప సినిమాలోని పాటలు ఉంటాయంటూ సోషల్ మీడియాలో శరత్ చంద్ర ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గీతా ఆర్ట్స్ లో సుదీర్ఘ కాలంగా ఉంటూ బన్నీకి పెద్ద అభిమానిగా గుర్తింపు దక్కించుకున్న శరత్ చంద్ర నాయుడు తాజాగా పుష్ప పాటల గురించి ట్విట్టర్ లో కామెంట్స్ చేశాడు. పుష్ప పాటలు మీ ప్లే లిస్ట్ లో చాలా కాలం ఉండబోతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ గారు అందించిన పాటలు మరో లెవల్ లో ఉంటాయంటూ ఆయన ట్వీట్ చేశాడు. అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబోలో రూపొందుతున్న ఈ సినిమా మరో లెవల్ లో ఉంటుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. వారి అంచనాలను మరింతగా పెంచేలా శరత్ చంద్ర నాయుడు వ్యాఖ్యలు ఉన్నాయి అనడంలో సందేహం లేదు.

ఆయన అభిమానుల అంచనాలను మరింతగా పెంచాడు. సినిమా ను రెండు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. మొదటి పార్ట్ ను సంక్రాంతికి విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి. సంక్రాంతికి ఇతర సినిమాలు ఉన్నాయి కనుక ముందే విడుదల చేస్తారేమో చూడాలి. సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుతున్న సుకుమార్ అతి త్వరలోనే విడుదల తేదీపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ మరియు సునీల్ లు కీలక పాత్రలో నటిస్తున్నారు. బన్నీ మొదటి పార్ట్ లో నెగటివ్ షేడ్స్ తో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ ను ఈ సినిమాలో ప్రత్యేకంగా కొత్త లుక్ లో చూడబోతున్నామని ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ మరియు వీడియోతో తేలిపోయింది.

సుకుమార్ రంగస్థలం మరియు బన్నీ అల వైకుంఠపురంలో సినిమా తర్వాత చేస్తున్న సినిమాల వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందా అనేది చూడాలి. పుష్ప సినిమా రెండవ పార్ట్ కు కాస్త గ్యాప్ తీసుకుని వచ్చే ఏడాదిలోనే మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అల్లు అర్జున్ పుష్ప రెండు పార్ట్ లతో ఉత్తరాది ప్రేక్షకులకు మరింత చేరువ అవుతాడు అంటూ ఆయన అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాతో దేవిశ్రీ ప్రసాద్ తన పూర్వ వైభవంను దక్కించుకోవడం ఖాయంగా అభిమానులు భావిస్తున్నారు.