Begin typing your search above and press return to search.

ఫ‌స్ట్ లుక్‌: మాసీ ర‌ఫ్ అండ్ ఠ‌ఫ్ `పుష్ప‌`

By:  Tupaki Desk   |   8 April 2020 4:17 AM GMT
ఫ‌స్ట్ లుక్‌: మాసీ ర‌ఫ్ అండ్ ఠ‌ఫ్ `పుష్ప‌`
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రి మూవీ మేక‌ర్స్ భారీ చిత్రం తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ముత్తం శెట్టి మీడియా నిర్మాణ భాగ‌స్వామి. `ఆర్య`.. `ఆర్య2` తర్వాత బ‌న్ని-సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ చిత్రంగా ఇప్ప‌టికే పాపులారిటీ ద‌క్కింది. ఇందులో రష్మిక మందన‌ కథానాయిక.

శేషాచ‌లం అడ‌వుల్లో గంధ‌పు చెక్కల స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే సినిమా ఇది. బ‌న్ని పాత్ర‌ చిత్తూరు యాస‌లో మాట్లాడుతుంది. తాజాగా టైటిల్& ఫ‌స్ట్ లుక్ రిలీజైంది. పుష్ప అనేది సినిమా టైటిల్. ఇక ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ లో బ‌న్ని పూర్తి మాసీగా .. ర‌గ్గ్ డ్ గా క‌నిపిస్తున్నాడు. గుబురు గ‌డ్డం.. గుబురు మీసం..బాగా పెరిగిన జుత్తు.. చెమ‌ట‌ల‌తో త‌డిసిన రూపం.. పైగా తీక్ష‌ణ‌మైన చూపుల‌తో బ‌న్నీ పాత్ర ఎంత ఎగ్రెస్సివ్ గా మాసీగా ఉండ‌నుందో పోస్ట‌ర్ చూస్తుంటేనే అర్థ‌మ‌వుతోంది. ఆ గ‌ళ్ల చొక్కా చూస్తుంటే ఒక విలేజీ కుర్రాడిగానే బ‌న్ని క‌నిపించ‌నున్నాడన్న‌మాట‌. ఇక ఈ చిత్రాన్ని తెలుగు-హిందీ-త‌మిళం- మ‌ల‌యాళం స‌హా సౌత్ లో అన్ని భాష‌ల్లో రిలీజ్ చేయ‌నున్నారు. నాలుగు భాష‌ల టైటిల్ పోస్ట‌ర్ల‌ను నేడు లాంచ్ చేసి పాన్ ఇండియా ప్ర‌య‌త్న‌మిద‌ని చెప్ప‌క‌నే చెప్పింది టీమ్.

ఈపాటికే మూవీ ప్రారంభం కావాల్సి ఉన్నా.. క‌రోనా ప్ర‌భావంతో షూటింగులు నిలిచిపోయిన సంగ‌తి తెలిసిందే. దేశ విదేశాల్లో లాక్ డౌన్ స‌న్నివేశం ఇబ్బందిక‌రంగా మారింది. అయితే టైటిల్ ఫ‌స్ట్ లుక్ లాంచ్ తో ర‌ణ‌భేరి మోగించాడు సుక్కూ. ఏమాత్రం ప‌రిస్థితులు అనుకూలించినా షూటింగ్ ప్రారంభించేస్తారు. బన్నీకి ఉన్న క్రేజ్‌.. `అల వైకుంఠపురములో`తో ఏర్పడిన మార్కెట్ ని.. సుకుమార్‌ గతంలో తీసిన`రంగస్థలం`గ్రాండ్‌ సక్సెస్ దృష్ట్యా ఈ మూవీపై తొలినుంచి అంచ‌నాలేర్ప‌డ్డాయి. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ప‌తాకంపై నవీన్‌ యెర్నేని- రవిశంకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.