Begin typing your search above and press return to search.

ఇవ్వలేదు.. వచ్చింది అంటున్న బన్నీ డాటర్

By:  Tupaki Desk   |   22 Sep 2019 12:22 PM GMT
ఇవ్వలేదు.. వచ్చింది అంటున్న బన్నీ డాటర్
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ గా తన అభిమానులతో ఏదో ఒక అప్డేట్ ను పంచుకుంటాడు. ఒక్కోసారి తన సినిమాలకు సంబంధించిన అప్డేట్లు షేర్ చేస్తే ఒక్కోసారి తన పిల్లలకు సంబంధించిన ఫోటోలను.. వీడియోలను షేర్ చేస్తుంటాడు.

ఈరోజు డాటర్స్ డే ఈ సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను అల్లు అర్జున్ తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేశాడు. ఈ వీడియోకు "కూతుళ్ళు అంటే ఈ ప్రపంచంలో అత్యంత అందమైనవారు. ఈ ప్రపంచంలో ఉన్న డాటర్స్ అందరికీ హ్యాపీ డాటర్స్ డే. ఈ సందర్భంగా మా పాపతో ఒక ఫన్నీ వీడియో ను షేర్ చేద్దామనుకున్నాను. #హ్యాపీ డాటర్స్ డే" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అల్లు అర్జున్ కు అర్హ అనే కూతురు ఉన్న సంగతి తెలిసిందే.

ఈ వీడియోలో అర్హ పాప క్యూట్ గా 'ఇవ్వలేదు.. వచ్చింది' అని చెప్పింది. 'అల వైకుంఠపురములో' టీజర్లో బన్నీ 'గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చింది' అనే డైలాగ్ చెప్తాడు. సింపుల్ గా ఉన్న డైలాగ్ అయినప్పటికీ అది సూపర్ గా క్లిక్ అయింది. ఆ డైలాగునే బన్నీ డాటర్ చెప్పడం.. ఆ తర్వాత నవ్వుతూ నాన్నను అల్లుకుపోవడం ఎంతో క్యూట్ గా ఉంది. ఈ వీడియోకు నెటిజన్ల నుండి భారీ స్పందన దక్కింది.


వీడియో కోసం క్లిక్ చేయండి