అది కానీ క్లిక్ అయితే బన్నీని ఆపడం కష్టమే

Sun Jan 19 2020 07:00:07 GMT+0530 (IST)

Allu Arjun On About Ala Vaikunthapurramuloo Movie

‘నా పేరు సూర్య’ తర్వాత భలేగా పుంజుకున్నాడు అల్లు అర్జున్. సింహం ఒక అడుగు వెనక్కి వేస్తే.. అనే నానుడిని గుర్తు చేసేలా ‘అల వైకుంఠపురములో’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ప్రభంజనం సాగిస్తున్నాడు బన్నీ. ఇలాంటి క్లాస్ సినిమా మాస్ సెంటర్లలో సైతం మోత మోగిస్తూ సాగిపొతోంది. ఒకేసారి టాప్ ఫామ్ అందుకున్న బన్నీ.. తర్వాత మాంచి మాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి.. దానికి పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు జరగడం ఖాయం. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ చేయబోయే కొత్త సినిమాకు టాక్ బాగుండాలే కానీ.. దాని రేంజే వేరుగా ఉంటుంది. సుకుమార్ ‘రంగస్థలం’ లాంటి మెగా హిట్ తర్వాత చేస్తున్న చిత్రమిది. బన్నీ ‘అల వైకుంఠపురములో’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సినిమా చేస్తున్నాడు.ఈ నేపథ్యంలో దీనిపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పేదేముంది? సుకుమార్ తన కెరీర్లో మరే సినిమాకూ లేని స్థాయిలో దీని కోసం కష్టపడ్డాడు. ఏడాదిన్నరకు పైగా స్క్రిప్టు మీద పని చేశాడు. ఈ చిత్ర రైటింగ్ టీం సమాచారం ప్రకారం స్క్రిప్టు వావ్ అనిపించేలా రూపొందిందని సమాచారం. ‘రంగస్థలం’ తరహాలోనే ఇది కూడా పీరియడ్ ఫిలిమే. దాని లాగే ఇది కూడా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ‘రా’గా సాగే చిత్రమే. ఇందులో హీరో ఎలివేషన్లు యాక్షన్ ఘట్టాలు ఓ రేంజిలో ఉంటాయట. సినిమా కొత్తగా ఉంటూనే.. మాస్‌ను కూడా మెప్పించేలా ఉంటుందని సమాచారం. ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లు ఉండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం బన్నీ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని విశ్లేషకుల అంచనా. త్వరలోనే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.