Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: ద్యావుడా.. స్టైల్ అదిరింది!

By:  Tupaki Desk   |   9 Dec 2019 8:52 AM GMT
ఫోటో స్టోరీ: ద్యావుడా.. స్టైల్ అదిరింది!
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో 'అల వైకుంఠపురములో' సినిమా తెరకెక్కుతోందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ ను మరో రెండు రోజుల్లో 11 వ తేదీన విడుదల చేస్తున్నారు. అంతలోపు శాంపిల్ లాగా ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఈ పోస్టర్ లో బన్నీ బ్లాక్ ప్యాంట్..వైట్ షర్టు ధరించి పైన రెడ్ కలర్ బ్లేజర్ తో కూల్ గా కనిపిస్తున్నాడు. మునివేళ్ళతో పట్టుకున్న ఫోన్.. మైఖేల్ జాక్సన్ తరహాలో బెల్ట్ ను ఒక చేత్తో పట్టుకుని సూపర్ స్టెప్ వేస్తున్నాడు. కూలింగ్ గ్లాసెస్.. బన్నీ హెయిర్ స్టైల్ అదిరిపోయాయి. ఈ పోస్టర్ చూస్తే బన్నీకి స్టైలిష్ స్టార్ బిరుదు ఎందుకు ఇచ్చారో మనకు వెంటనే అర్థం అవుతుంది. డ్రెస్ కలర్ కాంబినేషన్ మాత్రమే కాదు.. ఆ స్టెప్ వేస్తున్న తీరు.. గ్రేస్ అన్నీ సూపర్ గా ఉన్నాయి.

'అల వైకుంఠపురములో' ప్రమోషన్స్ ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. ఇక సినిమా టీజర్ రిలీజ్ అయితే సంక్రాంతి బాక్స్ ఆఫీస్ పోటీ మరింతగా వేడెక్కడం ఖాయమే. జనవరి 12 వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.