Begin typing your search above and press return to search.

అడ‌విలో వైల్డ్ డాగ్ ఇత‌నేనా!

By:  Tupaki Desk   |   20 Feb 2020 1:30 AM GMT
అడ‌విలో వైల్డ్ డాగ్ ఇత‌నేనా!
X
వేష‌ధార‌ణ ప‌రంగా ప్ర‌యోగాలు చేయ‌డంలో బ‌న్ని త‌ర్వాత‌నే. గంగోత్రి సినిమాలో చూసిన బ‌న్నీకి దేశ‌ముదురులో బ‌న్నీకి ఎంత తేడానో చూశాం. ఆ త‌ర్వాత సినిమా సినిమాకి అత‌డి గెట‌ప్ లు మారిపోయాయ్. న‌ట‌న ప‌రంగానూ ప‌రిణ‌తి ఎంతో ఎత్తుకు ఎదిగింది. ఆర్య - ఆర్య 2 లుక్ ట్రెండ్ సెట్ట‌ర్. ఆ తర్వాత స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిలో కొత్త‌గా క‌నిపించే ప్ర‌య‌త్నం చేశాడు. డిజాస్ట‌ర్ మూవీ నా పేరు సూర్య‌లోనూ బ‌న్ని ఆర్మీ మేన్ గా ఎంతో ఎగ్రెస్సివ్ గా క‌నిపించి ఆక‌ట్టుకున్నాడు. అందులో కాస్ట్యూమ్స్ ఆక‌ట్టుకున్నాయి. మొన్న అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంలో ఒక ర‌కమైన టోన్ తో కొత్త‌గా క‌నిపించాడు.

ఇదంతా ఒకెత్తు అనుకుంటే.. ఇప్పుడు ఆర్య సుక్కూ బ‌న్నీని పూర్తిగా మార్చేస్తున్నాడ‌ని తాజా లీక్ చెబుతోంది. లేటెస్టుగా బ‌న్ని లుక్ కి సంబంధించిన ఫోటో ఒక‌టి రివీలైంది. ఈ ఫోటోలో అత‌డు బ్లాక్ టీష‌ర్ట్ తో క‌నిపించాడు. టీష‌ర్ట్ పై వైల్డ్ డాగ్ క‌నిపిస్తోంది. అడ‌విలో రాత్రి కూడా వేటాడే రేసు కుక్క‌లా క‌నిపిస్తోంది అది. ఈ ప్రిప‌రేష‌న్ ఏమిటో కానీ చూస్తుంటే సుక్కూ కోస‌మేన‌ని అర్థ‌మవుతోంది.

సుకుమార్ AA20 సినిమాని మెజారిటీ పార్ట్ అడ‌వుల్లో తెర‌కెక్కించనున్నారు. అడ‌వులు .. ఎర్ర‌చంద‌నం స్మగ్లింగ్ అంటూ కొత్త‌గానే ట్రై చేస్తున్నారు. ఇక ఇందులో ఎర్ర‌చంద‌నం త‌ర‌లించే గుంపులో బ‌న్ని ఒక డ్రైవ‌ర్ గా క‌నిపిస్తాడ‌ని చెబుతున్నారు కాబ‌ట్టి ఆ లుక్ ఎలా ఉంటుందోనంటూ అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. ఇదిగో ఇలా ఉంటాడు! అని తాజాగా లీకైన ఫోటో చెప్ప‌క‌నే చెబుతోంది. బాగా బాడీ పెంచాడు.. గ‌డ్డం మీసాలు పెంచాడు. గుబురుగా ర‌ఫ్ గా క‌నిపిస్తున్నాడు. బ్యాంకాక్ నుంచి హాలీడే ట్రిప్ ముగించి హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడు విమానాశ్ర‌యంలో ఇలా చిక్కాడు. అన్న‌ట్టు క‌రోనా భ‌యంతో ప‌ని లేకుండా బ్యాంకాక్ అడ‌వుల్లో సుక్కూ సినిమా మొద‌లెట్టేస్తున్నాడా ఏమిటో తెలియాల్సి ఉందింకా.