Begin typing your search above and press return to search.

బన్నీ వాళ్లిద్దరికి హ్యాండ్‌ ఇచ్చినట్లేనా?

By:  Tupaki Desk   |   29 July 2020 11:30 AM GMT
బన్నీ వాళ్లిద్దరికి హ్యాండ్‌ ఇచ్చినట్లేనా?
X
అల్లు అర్జున్‌ ఈ ఏడాది అల వైకుంఠపురంలో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బిగ్గెస్ట్‌ హిట్‌ సక్సెస్‌ ను దక్కించుకున్నాడు. ఈ ఏడాదిలో అదే బిగ్గెస్ట్‌ హిట్‌ అలాగే నాన్‌ బాహుబలి రికార్డును దక్కించుకోవడంతో పాటు బన్నీ కెరీర్‌ లో బిగ్గెస్ట్‌ సక్సెస్‌ గా నిలిచింది. ఆ చిత్రం తర్వాత బన్నీ చేస్తున్న చిత్రం ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప చిత్రం తర్వాత వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఐకాన్‌ అనే చిత్రాన్ని మరియు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో మరో సినిమాను బన్నీ చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కాని తాజాగా బన్నీ కొరటాల శివతో జత కట్టబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

చిరంజీవితో ఆచార్య సినిమాను చేస్తున్న కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని బన్నీతో చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. సూపర్‌ సక్సెస్‌ రేటు ఉన్న దర్శకుడు కొరటాల అడగడం బన్నీ నో అంటాడా. అందుకే కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ మూవీ దాదాపుగా కన్ఫర్మ్‌ అంటున్నారు. బన్నీ పుష్ప పూర్తి చేయడానికి కొరటాల ఆచార్య సినిమా పూర్తి చేయడానికి సమయం పడుతుంది. కనుక వచ్చే ఏడాది ద్వితీయార్థంలో వీరిద్దరి కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందంటున్నారు.

బన్నీ కోసం ఇప్పటికే కొరటాల శివ స్క్రిప్ట్‌ ను రెడీ చేశాడట. బన్నీని స్టూడెంట్‌ లీడర్‌ పాత్రలో కొరటాల చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. కొరటాల శివ తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సామాజిక సమస్యను గురించి సున్నితంగా చూపిస్తూ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ తో స్క్రీన్‌ ప్లేను నడిపిస్తూ ఉంటాడు. ప్రస్తుతం వీరిద్దరు చేస్తున్న సినిమాలు పూర్తి అయిన తర్వాత అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఒక వేళ కొరటాల శివతో బన్నీ సినిమా కన్ఫర్మ్‌ అయితే వేణు శ్రీరామ్‌ విక్రమ్‌ కుమార్‌ లకు హ్యాండ్‌ ఇచ్చినట్లేనా లేదంటే ఆ తర్వాత వీరితో సినిమాలు ఉంటాయా అనేది చూడాలి.