బన్నీ ఫ్యాన్ హాస్పిటల్ అంతా ఉత్తి కథేనట!

Tue Oct 22 2019 19:37:23 GMT+0530 (IST)

సోషల్ మీడియాలో కొన్ని వందల రకాలుగా మోసాలు చేస్తున్నారు. టెక్నాలజీ పెరిగినా కొద్ది మోసాల తీరు మారుతుంది. టెక్నాలజీని ఉపయోగించుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా సెలబ్రెటీల పేర్లు చెప్పుకుని మోసాలు చేసే వారి సంఖ్య ఈమద్య సోషల్ మీడియాలో చాలా ఎక్కువ అయ్యింది. కొన్నాళ్ల క్రితం ప్రముఖ స్టార్ పేరు చెప్పి ఆయన్ను కలిపిస్తానంటూ ఒక వ్యక్తి మోసం చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు అల్లు అర్జున్ పేరు చెప్పి వినయ్ అనే వ్యక్తి చేసిన హంగామా అంతా ఇంతా కాదు.అల్లు అర్జున్ ఫ్యాన్ అయిన వినయ్ అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు కొట్టారని.. ప్రస్తుతం అతడు ప్రాణాలతో పోరాడుతూ అమెరికాలో వైధ్యం పొందుతున్నాడని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను ఆ పోస్ట్ కు ట్యాగ్ చేయడంతో చాలా మంది బన్నీ ఫ్యాన్స్ వినయ్ విషయంలో స్పందించారు. తమ తోటి అభిమాని అనే ఉద్దేశ్యంతో తమకు తోచిన సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు లక్షల రూపాయలు వినయ్ చికిత్స కోసం బన్నీ ఫ్యాన్స్ డొనేట్ చేశారట.

ఇంత జరిగిన తర్వాత వినయ్ అనే వ్యక్తికి ఏమీ కాలేదని అతడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూళ్లు చేశాడంటూ తేలింది. బన్నీ పేరుతో అతడు చేసిన పనికి ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనబడితే చితకొట్టేయాలన్నంత కోపంతో ఉన్నారు. సోషల్ మీడియాలో అభిమానులను చీటింగ్ చేసేందుకు కొందరు ఇలాంటి వారు ఉంటారని.. కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అభిమానం పేరును డబ్బు వసూళ్లు చేసే వారి విషయంలో కాస్త డెప్త్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది మోసం అయినా తోటి ఫ్యాన్ ఒకడు ఆపదలో ఉన్నాడు అనగానే బన్నీ ఫ్యాన్స్ రియాక్ట్ అయిన తీరు అభినందనీయం.