Begin typing your search above and press return to search.

హ్యాపీ బర్త్‌ డే క్యూటీ.. భార్యకు బన్నీ లవ్లీ విషెష్‌

By:  Tupaki Desk   |   29 Sep 2022 7:41 AM GMT
హ్యాపీ బర్త్‌ డే క్యూటీ.. భార్యకు బన్నీ లవ్లీ విషెష్‌
X
అల్లు అర్జున్‌ ఫ్యామిలీ ని చూస్తే ముచ్చటేస్తుంది. ఆయన అభిమానులు రెగ్యులర్ గా అర్హ మరియు అయాన్ ల ఫోటోలతో పాటు స్నేహా రెడ్డి ఫోటోను కూడా షేర్ చేస్తూ ఉంటారు. అల్లు అర్జున్‌ మరియు స్నేహా లు పిల్లలతో ఉండే ఫోటోలు రెగ్యులర్ గా వైరల్‌ అవుతూనే ఉంటాయి. తాజాగా అల్లు అర్జున్‌ మరో ఫోటోను షేర్‌ చేశాడు.

స్నేహా బర్త్‌ డే సందర్భంగా ట్విట్టర్ లో హ్యాపీ బర్త్ డే క్యూటీ అంటూ ట్వీట్ చేసి ఈ ఫోటోను షేర్ చేశాడు. అమ్మ స్నేహా తో ముద్దుల పాప అల్లు అర్హ కేక్ కట్‌ చేయించడం ఈ ఫోటోలో చూడవచ్చు. అయాన్ మరియు అల్లు అర్జున్ లు కూడా చాలా ప్రేమతో స్నేహా బర్త్‌ డే సెలబ్రేషన్ లో కనిపిస్తున్నారు.

అల్లు అర్జున్ మరియు స్నేహాలది ప్రేమ వివాహం. పెళ్లి అయ్యి దశాబ్ద కాలం పూర్తి అయ్యింది. వారి మధ్య ప్రేమ పెరిగింది కానీ తగ్గలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అందుకు ప్రత్యక్ష్య సాక్ష్యం వారి యొక్క పిల్లలు. ఇద్దరు పిల్లలను కూడా ఎంతో పద్దతిగా పెంచుతూ ఇతర సెలబ్రెటీలకు ఆదర్శంగా ఉంటున్నారు.

ఇక పుష్ప రాజ్ విషయానికి వస్తే ఇటీవలే పుష్ప 2 కి సంబంధించిన స్క్రిప్ట్‌ ని దర్శకుడు సుకుమార్‌ ముగించాడు అనేది సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ జరుగుతోంది.

అక్టోబర్‌ 1వ తారీకున అల్లు స్టూడియోస్‌ ప్రారంభోత్సవం జరగబోతుందట. ఆ స్టూడియోలో అక్టోబర్ రెండవ వారం నుండి పుష్ప 2 షూటింగ్‌ ప్రారంభించాలని సుకుమార్‌ భావిస్తున్నాడట.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.