బన్నీ - బుచ్చిబాబు మధ్య కథా చర్చలు జరుగుతున్నాయా..?

Wed Jun 09 2021 12:00:04 GMT+0530 (IST)

Allu Arjun Buchi Babu Sana Combo

అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప' అనే యాక్షన్ ఎంటర్టైనర్ లో చేస్తున్నాడు. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ సంబంధించిన మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయింది. 'పుష్ప 1' చిత్రాన్ని ఈ ఏడాది రిలీజ్ చేసి.. పార్ట్-2 ని వచ్చే సంవత్సరం సమ్మర్ నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత బన్నీ చేసే సినిమా ఏంటనేది ఇంకా క్లారిటీ రాలేదు.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తో అల్లు అర్జున్ ఓ మూవీ అనౌన్స్ చేశాడు కానీ.. 'పుష్ప' లేట్ అవుతుండటంతో ఎన్టీఆర్ వైపుకు షిఫ్ట్ అయ్యారు కొరటాల. దీంతో 'ఆచార్య' దర్శకుడితో బన్నీ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మరికొందరు క్రేజీబీడైరెక్టర్స్ ని లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరియు ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను లతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో లేటెస్టుగా దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా అల్లు కాంపౌండ్ లో ప్రత్యక్షమయ్యాడు.

'ఉప్పెన' సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు బుచ్చిబాబు. ఈ సినిమా సక్సెస్ అవడంతో దర్శకుడికి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. అయితే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలోనే రెండో సినిమా చేయడానికి బుచ్చిబాబు కమిట్ అయ్యారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ తో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి. ఇటీవల తారక్ బర్త్ నాడు పెట్టిన పోస్ట్ తో వీరి కాంబోలో సినిమా ఉండబోతోందని హింట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఉప్పెన దర్శకుడు.. అల్లు అర్జున్ ని మీట్ అవడం ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

బన్నీ - బుచ్చిబాబు కలయిక సినిమా కోసమే అని.. కథా చర్చలు జరుపుతున్నారని టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమా ఇప్పట్లో కార్యరూపం దాల్చే అవకాశం లేకపోవడంతో బుచ్చిబాబు ఇతర హీరోల కోసం ప్రయత్నిస్తున్నారట. తారక్ 'ఆర్.ఆర్.ఆర్' - కొరటాల శివ - ప్రశాంత్ నీల్ సినిమాలను పూర్తి చేసిన తర్వాతే బుచ్చిబాబు గురించి ఆలోచిస్తాడు. అందుకే మైత్రీ టీమ్ బన్నీ - బుచ్చిబాబు కాంబో సెట్ చేయాలని చూస్తోందని టాక్ వినిపిస్తోంది. మరి 'పుష్ప 2' తర్వాత బుచ్చి తోనే అల్లు అర్జున్ సినిమా చేస్తాడేమో చూడాలి.