Begin typing your search above and press return to search.

అవి నెట్లో చూస్తాంలే బన్నీ.. నువ్వెక్కడ!?

By:  Tupaki Desk   |   12 Jun 2018 5:56 AM GMT
అవి నెట్లో చూస్తాంలే బన్నీ.. నువ్వెక్కడ!?
X
అల్లు అర్జున్ ప్రస్తుతం పారిస్ లో చక్కర్లు కొడుతున్నాడు. అక్కడి నుంచి తెగ అప్ డేట్స్ పెడుతున్నాడు. నా పేరు సూర్య నిరుత్సాహపరిచిన తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేయనున్నాడనే పాయింట్ పై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు.

అయితే.. సూర్య పాత్రలో ఇమిడిపోయేందుకు బాగా కష్టపడిన బన్నీ.. ఇప్పుడు వెకేషన్ లో ఉన్నాడు. యూరోప్ టూర్ కు వెళ్లిన స్టైలిష్ స్టార్.. అక్కడి అద్భుత ప్రాంతాలను సందర్శిస్తున్నాడు. తన కంటితో చూసిన ప్రదేశాలను.. అభిమానులకు కూడా చూపించాలనే ఉద్దేశ్యంతో ఇన్ స్టాగ్రామ్ లో వరుస అప్ డేట్స్ తో ముంచెత్తుతున్నాడు. బన్నీ ఇన్నేసి పోస్టులు పెట్టడం ఫ్యాన్స్ కు కూడా కొత్తే కాబట్టి.. ఫ్యాన్స్ కూడా బాగానే ఫాలో అవుతున్నారు. అయితే.. ఎన్ని ఫోటోలు కనిపిస్తున్నా వీటిలో ఎక్కడా అల్లు అర్జున్ కనిపించడం లేదు.

పారిస్ లోని మాన్యుమెంట్స్ ఫోటోలు మాత్రమే కనిపించడం మరీ ఆశ్చర్యకరం. తాను ఏయే ప్రదేశాలు చూశాడో చెబితే.. వీటన్నిటినీ మనం ఇంటర్నెట్ లో చూసుకోవచ్చు కదా. తాను అక్కడ ఉన్న ఫోటోలను అందిస్తే.. వాటిని అభిమానులు మెమరీస్ గా దాచుకుంటారు. వాటిలో తను లేకుండా.. కేవలం ఇన్ స్టాలో స్టైలిష్ స్టార్ పోస్ట్ మాత్రమే చేస్తే.. వాటితో ఫ్యాన్స్ కు ఉపయోగమేంటో?