Begin typing your search above and press return to search.

తగ్గేదేలే... ఢీ లో బన్నీ హాట్‌ రొమాంటిక్ కామెంట్ వైరల్‌

By:  Tupaki Desk   |   4 Dec 2021 2:30 AM GMT
తగ్గేదేలే... ఢీ లో బన్నీ హాట్‌ రొమాంటిక్ కామెంట్ వైరల్‌
X
అల్లు అర్జున్‌ తాజాగా ఈటీవీలో ప్రసారం అయ్యే ఢీ షో ఫినాలే ఎపిసోడ్‌ కు స్పెషల్‌ గెస్ట్ గా హాజరు అయ్యాడు. ఈ వారం ఆ ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రోమోను వదిలారు. ప్రోమోతో షో పై అంచనాలు భారీగా పెంచేశారు. మెగా అభిమానులు మాత్రమే కాకుండా అంతా కూడా చూడాలని కోరుకునే విధంగా ప్రోమో ను కట్‌ చేశారు. అల్లు అర్జున్‌ మాస్ ఎంట్రీ ఎప్పటి లాగే సుడిగాలి సుధీర్‌ ఆదిల కామెడీ పంచ్‌ లు ఇక జడ్జ్‌ ల స్పెషల్‌ చిట్ చాట్ లు ఇలా అన్ని కలిపి రాబోయే ఎపిసోడ్‌ బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది అన్నట్లుగా బుల్లి తెర ప్రేక్షకులు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్‌ ఈ షో లో కంటెస్టెంట్స్.. మెంటర్స్ మరియు జడ్జ్‌ ల పై వేసిన పంచ్ లు బాగానే పేళినట్లుగా ప్రోమో చూస్తుంటే అర్థం అవుతోంది.

అల్లు అర్జున్‌ ఒక సందర్బంలో మాట్లాడుతున్న సమయంలో ప్రియమణి మీతో నటించే అవకాశం నాకు దక్కలేదు అంటూ కాస్త నిటూర్చింది. అప్పుడు బన్నీ సమయస్ఫూర్తితో ఇప్పటికి అయినా ఏమైంది సన్నబడి హాట్ గానే ఉన్నారు తప్పకుండా చేద్దాం అన్నట్లుగా కామెంట్స్ చేశాడు. ఆ వ్యాఖ్యలతో అక్కడున్న వారు అంతా కూడా గట్టిగా మొత్తుకున్నారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌ అవుతున్నాయి. నిజానికి అల్లు అర్జున్ కంటే ప్రియమణి పెద్ద ఏజ్‌ ఏమీ కాదు. గూగుల్‌ చెబుతున్న దాని ప్రకారం చూస్తే ఇద్దరికి ఒక్క ఏడాది తేడా.. పైగా అల్లు అర్జున్ ఒక ఏడాది పెద్ద. కనుక ప్రియమణి ఎలాగూ సన్నగా హాట్‌ గా ఉంది కనుక బన్నీ తల్చుకుంటే ఆమెకు హీరోయిన్ గా కాకున్నా ప్రత్యే పాటలో అయినా లేదంటే సెకండ్‌ హీరోయిన్ గా అయినా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.

ఢీ ఫినాలే ఎపిసోడ్‌ సందర్బంగా బన్నీ చేసిన కామెంట్స్ నిజం అవ్వాలని ప్రియమణి మరియు ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే పుష్ప సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. బన్నీ పుష్ప సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా షూటింగ్‌ పూర్తి అయిన విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ట్రైలర్ ను విడుదల చేయబోతున్న నేపథ్యంలో సినిమా పై అంచనాలు మరింత పెరగనున్నాయి. అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్నా జంటగా తెరకెక్కిన ఈ సినిమాను సుకుమార్‌ మరో రేంజ్ అన్నట్లుగా తెరకెక్కించాడు. డిసెంబర్ 17న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున విడుదల అవ్వబోతున్న పుష్ప సినిమా బన్నీ కెరీర్‌ లో భారీ చిత్రంగా నిలవబోతుందనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.