వీడియో : బన్నీ 19 మొదలైంది

Wed Apr 24 2019 17:45:59 GMT+0530 (IST)

Allu Arjun And Trivikram New Movie Shoot Begins

నా పేరు సూర్య తర్వాత ఏడాది గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎట్టకేలకు సెట్ లోకి అడుగు పెట్టాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ హారికా హాసిని బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న బన్నీ 19వ మూవీ షూటింగ్ ఈ రోజు నుంచి రెగ్యులర్ గా కొనసాగనుంది. ఈ మేరకు యూనిట్ చిన్న వీడియోని విడుదల చేసింది.అల్లు అర్జున్ తన కారులో నుంచి సెట్ లోకి వెళ్ళడం తన ఇద్దరు పిల్లలు అందులో సందడి చేయడం తాతయ్య అల్లు అరవింద్ తో పాటు మరో నిర్మాత చినబాబు పర్యవేక్షిస్తూ సాగడం అంత నిమిషంలోపే చూపించారు. చివర్లో త్రివిక్రమ్ యాక్షన్ అని చెప్పడం దాని కన్నా సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ సిద్ధం కావడం తప్ప ఇంకేది రివీల్ చేయలేదు

ఎక్కువ బ్రేక్స్ లేకుండా షూటింగ్ ని నిరవధికంగా కొనసాగించనున్నట్టు తెలిసింది. మొదటి షెడ్యూల్ ఎన్ని రోజులు ఉంటుంది అనే వివరాలు ఇంకా తెలియలేదు. పూజా హెగ్డే హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో మలయాళం యాక్టర్ జయరాం తండ్రిగా నటిస్తుండగా మాజీ హీరొయిన్ టబు తల్లి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే తమన్ మ్యూజిక్ సిటింగ్స్ మొదలు పెట్టి ట్యూన్స్ సిద్ధం చేస్తున్నాడు.

పూజా హెగ్డే ప్రభాస్ షూటింగ్ నుంచి బ్రేక్ దొరగ్గానే ఇందులో పాల్గొనబోతోంది. సంవత్సరం తర్వాత మొదలైన సినిమా కావడంతో బన్నీ ఫ్యాన్స్ దీని మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు. అరవింద సమేత వీర రాఘవతో తిరిగి సక్సెస్ ట్రాక్ లో పడ్డ త్రివిక్రమ్ ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని వస్తున్నారు