Begin typing your search above and press return to search.

బ‌న్ని-స్నేహ జంట జాగింగ్ ప్లేస్ ఎక్క‌డో తెలుసా?

By:  Tupaki Desk   |   3 July 2020 4:00 AM GMT
బ‌న్ని-స్నేహ జంట జాగింగ్ ప్లేస్ ఎక్క‌డో తెలుసా?
X
వైర‌స్ మ‌హ‌మ్మారీ దెబ్బ‌కు ప‌బ్లిక్ ప్లేసులు బంద్ అయిపోయిన సంగ‌తి తెలిసిందే. పార్కులు.. హోట‌ళ్ల‌ను ప్ర‌భుత్వాలు బ్యాన్ చేశాయి. ఆ క్ర‌మంలోనే నిరంత‌రం ర‌ద్ధీగా ఉండే జూబ్లీహిల్స్ సెల‌బ్రిటీ పార్క్ కేబీఆర్ కాస్తా వెల‌వెల‌బోతోంది. అయితే కేబీఆర్ పార్క్ కి ఔట‌ర్ లో ఉన్న బాట మాత్రం నిరంత‌రం క‌ళ‌క‌ళ‌లాడుతోంది. ఇక వేకువ‌ఝామున కేబీఆర్ పార్క్ చుట్టుప‌క్కల వంద‌లాది కార్ల‌తో ఎప్పుడూ ట్రాఫిక్ కి అంత‌రాయం క‌లిగేది. కానీ ఇప్పుడు ఆ స‌మ‌స్య కూడా ఏమంత క‌నిపించ‌డం లేదు.

అదంతా స‌రే కానీ.. కేబీఆర్ పార్క్ ని మూసేశాక సెల‌బ్రిటీలంతా ఎక్క‌డ జాగింగ్ చేస్తున్నారు? అంటే .. త‌మ ఆవాసాల‌కు స‌మీపం లో ఉండే రోడ్ల‌ పైనే తెల్ల‌వారుఝామున జాగింగ్ చేసి స‌రిపెట్టుకుంటున్నారు. అలాగే వ్య‌క్తిగ‌త జిమ్ లు.. స్విమ్మింగ్ పూల్స్ లో స్విమ్మింగ్ వ‌గైరా వ్యాప‌కాల‌తో రోజువారీ వ్యాయామం పూర్తి చేస్తున్నారు. ఇటీవ‌లే కేబీఆర్ కి రిస్ట్రిక్ష‌న్స్ తొల‌గించిన‌ట్టే క‌నిపిస్తోంది.

ఇదిగో లేటెస్టు గా బ‌న్ని-స్నేహ జంట జాగింగ్ కి వెళ్లిన‌ప్ప‌టి ఫోటోలు తాజాగా అంత‌ర్జాలం లో వైర‌ల్ అవుతున్నాయి. ఈ జంట రెగ్యుల‌ర్ గా కేబీఆర్ పార్క్ వెలుప‌లి బాట‌ లో జాగింగ్ చేస్తున్నారు. అలా కెమెరా కంటికి చిక్కారిలా. బ‌న్ని ఆడిడాస్ బ్లాక్ టీష‌ర్ట్.. ట్రాక్ తో పాటు నైక్ షూస్ ధ‌రించి జాగింగ్ చేస్తున్నారు. స్నేహా రెడ్డి వైట్ ఆడిడాస్ టాప్ .. బ్లాక్ ట్రాక్ సూట్ లో క‌నిపించారు.