Begin typing your search above and press return to search.

పుష్ప‌రాజ్ కు అల్లు అర్హ‌ స్వీట్ వెల్క‌మ్

By:  Tupaki Desk   |   29 Jan 2022 8:30 AM GMT
పుష్ప‌రాజ్ కు అల్లు అర్హ‌ స్వీట్ వెల్క‌మ్
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైమ్ మామూలుగా లేదు. ఆయ‌న క్రేజ్ ఇప్పుడు వ‌ర‌ల్డ్ వైడ్ గా వైర‌ల్ గా మారింది. ఆయ‌న న‌టించిన పాన్ ఇండియా మూవీ `పుష్ప‌`. సుకుమార్ అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కించిన ఈ చిత్రం ద‌క్షిణాదితో పాటు ఉత్త‌రాదిలోనూ సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. మ‌రీ ప్ర‌ధానంగా చెప్పాలంటే ద‌క్షిణాదికి మించి ఉత్త‌రాదిలోనూ ఈ మూవీ ప్ర‌కంప‌ణ‌లు సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్లుని రాబ‌డుతూ బాలీవుడ్ చిత్రాల‌కే స‌వాళ్ల‌ని విసురుతూ ట్రేడ్ పండితుల్ని విస్మ‌యానికి గురిచేస్తోంది.

గ‌త ఏడాది డిసెంబ‌ర్ 17న విడుద‌లైన ఈ మూవీ వ‌సూళ్ల ప‌రంగానే కాకుండా సినిమా క్రేజ్ ప‌రంగానూ ఎంటైగ‌ర్ గ్లోబ్ హాట్ టాపిక్ గా మారింది. క్రికెట‌ర్లు, టాప్ స్టార్లు ఈ మూవీ కి ప్ర‌చార క‌ర్త‌లుగా మారి `పుష్ప‌` సిగ్నేచ‌ర్ స్టెప్ ల‌తో హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. దీంతో పైసా ఖ‌ర్చు లేకుండా ఈ మూవీకి వ‌ర‌ల్డ్ మొత్తం ప్ర‌చారం ల‌భిస్తోంది. ఈ కార‌ణంగా `పుష్ప‌` ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. నెల రోజులుగా దాటినా భార‌తీయ బాక్సాఫీస్ వ‌ద్ద అదే జోరుని చూపిస్తూ వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది.

ఇక్క‌డో షాకింగ్ విష‌యం ఏంటంటే ఎలాంటి ప్ర‌చారం నిర్వ‌హించ‌ని ఉత్త‌రాది బాక్సాఫీస్ వ‌ద్ద `పుష్ప‌` ఏకంగా 96.75 కోట్ల మార్కుని దాట‌డం. ఈ స్థాయిలో అక్క‌డ `పుష్ప‌` వ‌సూళ్ల‌ని రాబ‌డుతుంది మేక‌ర్స్ కూడా ఊహించ‌లేదు. ఇలా ఊహించని ఫ‌లితం ఉత్త‌రాది నుంచి రావ‌డంతో మేక‌ర్స్ తో పాటు డైరెక్ట‌ర్ సుకుమార్, హీరో బ‌న్నీ ఆ ఆనందాన్ని సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. `పుష్ప‌` ఫీవ‌ర‌ల్ వ‌ర‌ల్డ్ వైడ్ గా పీక్స్ కి చేర‌డం తో సెల‌బ్రేష‌న్స్ కోసం దుబాయ్ వెళ్లిన బ‌న్నీ అక్క‌డి అందాల మ‌ధ్య ఎంజాయ్ చేసి తాజాగా హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చారు.

దుబాయ్ లో బ‌న్నీ దాదాపు 16 రోజులు గ‌డిపారు. అక్క‌డి అందాల‌ని ఆస్తాదిస్తూ త‌న‌కు చిక్కిన స‌మ‌యాన్ని ఎంజాయ్ చేశారు. ఇటీవ‌ల త‌ను దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్న విష‌యాన్ని ఓ ఫొటో షేర్ చేసి బ‌న్నీ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. 16 రోజుల త‌రువాత హైద‌రాబాద్ కు తిరిగి వ‌చ్చిన బ‌న్నీకి ఆయ‌న ముద్దుల కూతురు అల్లు అర్హ స్వీట్ వెల్క‌మ్ చెప్పి స‌ర్ ప్రైజ్ చేసింది.

ఆకులు, గులాబీ పూల రెక్క‌ల‌తో `వెల్క‌మ్ నాన్న‌` అని రాసి బ‌న్నీకి ఇంట్లోకి స్వాగ‌తంచెప్పింది. బన్నీ ఈ ఫొటోని సోష‌ల్ మీడియా ఇన్‌స్టా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ ఫొటోకి `ప‌ద‌హారు రోజుల త‌రువాత స్వీటెస్ట్ వెల్క‌మ్‌` అంటూ క్యాప్ష‌న్ ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈ ఫొటో నెట్టింట సంద‌డి చేస్తోంది. ప్ర‌స్తుతం `పుష్ప -2` కు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే షూటింగ్ ని ప్రారంభించాల‌ని ఏర్పాట్లు చేస్తున్నారు.