వీడియో: అల్లు అర్హకు లైఫ్ టైమ్ మెమరబుల్ గిఫ్ట్

Sat Nov 21 2020 15:00:29 GMT+0530 (IST)

Video: Lifetime Memorable Gift to Allu Arha

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వారసురాలు అల్లు అర్హ తొలి పరిచయం అంటూ ఇప్పటికే బోలెడంత ప్రచారం జరగడంతో .. ఆ గ్లింప్స్ ని క్యాచ్ చేయాలని అల్లు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వేచి చూశారు. అంజలి మూవీ నుంచి అంజలి అంజలి పాటకు రీమిక్స్ గా ఈ కవర్ సాంగ్ ని చిత్రీకరించగా బేబి షామిలి పాత్రలో అల్లు అర్హ కనిపించింది. తాజా వీడియోలో అర్హ క్యూట్ లుక్స్.. చక్కని ఎక్స్ ప్రెషన్స్ అభిమానుల్ని ఆకట్టుకున్నాయి.ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న ఈ వీడియోని అల్లు అర్జున్ స్వయంగా రిలీజ్ చేశారు. వీడియో ఆద్యంతం అర్హ అల్లరి వేషాలు చిలిపితనం క్యూట్ అప్పియరెన్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. స్వతహాగానే అర్హ అల్లరి వేషాలకు ఇంతకుముందే బోలెడంత పాపులారిటీ దక్కింది. తాజా వీడియోలో అల్లు అర్జున్.. అల్లు అరవింద్ తదితరులు ఛమక్కుమని మెరవడం మరో కొసమెరుపు.

నేడు(నవంబర్ 21) అర్హ నాలుగో పుట్టిన రోజు సందర్భంగా బన్ని ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఇది. 1990లో రిలీజైన అంజలి సినిమాలో క్లాసిక్ గీతాలకు ఇలయరాజా ట్యూన్స్ ప్రధాన అస్సెట్. ఇప్పుడు అలాంటి క్లాసిక్ తో అర్హ పరిచయం అవ్వడంతో అభిమానుల్లోకి వైరల్ గా దూసుకెళుతోంది. ఈ వీడియోని దేశవ్యాప్తంగా ఉన్న బన్ని అభిమానులు సోషల్ మీడియాల్లో వైరల్ గా షేర్ చేస్తున్నారు.