Begin typing your search above and press return to search.

అల్లు అరవింద్ కీలక మీటింగ్?

By:  Tupaki Desk   |   6 Feb 2023 1:44 PM GMT
అల్లు అరవింద్ కీలక మీటింగ్?
X
అల్లు ఆయన ఇంటి పేరు. హాస్యానికి మారుపేరైనా అల్లు రామలింగయ్య తనయుడిగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం టాలీవుడ్ దిగ్గజ నిర్మాతల్లో సక్సెస్​ఫుల్ ​గా రాణిస్తున్నారు అల్లు అరవింద్. ఈయన ఒకప్పుడు ‘మెగా కాంపౌండ్​ కు పునాది! ఇప్పుడు తమ కాంపౌండ్ హీరోలతో పాటు పలువురు కథానాయకులతో 'గీతా ఆర్ట్స్'‘ పతాకంపై అభిరుచి గల చిత్రాలను నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ నుంచి వచ్చిన పలు భారీ హిట్​లను అందుకున్నాయి. కొంతకాలం క్రితం ఓటీటీలోకి కూడా అడుగుపెట్టి ఆహా పేరుతో ఓ కొత్త ప్రపంచాన్నే సృష్టించారు. కాలానుగుణంగా ప్రణాళికలు రచిస్తూ సక్సెస్​ ను తన పక్కన పెట్టుకుని అన్​స్టాపబుల్ ​గా దూసుకెళ్తున్నారు. ఇంకా చెప్పాలంటే వర్ధమాన నిర్మాతలకు ఓ రోల్ మోడల్ ​గా మారారు.

అయితే ఆయన చిత్రాలను నిర్మించడంతో పాటు చిత్రసీమలో ఎలాంటి పాత్ర పోషిస్తారో కూడా తెలిసిందే. అయితే తాజాగా ఆయన ఓ కీలక మీటింగ్​ను ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు సాయంత్రమే ఓ ప్రెస్ మీట్ పెట్టి.. ఓ కీలక అంశంపై మాట్లాడనున్నారని సమాచారం. ప్రస్తుతానికి ఈ విషయం సస్పెన్స్ ​గానే ఉంది. అసలు అదేంటనేది ఇది రివీల్ కానుంది. ఈ విషయం బయటకు తెలిసినప్పటి నుంచి ఈ మీటింగ్ ఏంటనేది ప్రస్తుతం చిత్రసీమలో హాట్​టాపిక్​ గా మారింది.

ఇక మరికొంత మంది బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో గురించి అంటున్నారు. అందులో బాలయ్య నర్సులపై చేసిన వ్యాఖ్యలపై అల్లు అరవింద్ మాట్లాడుతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఈ వివాదంపై బాలకృష్ణ కూడా నర్సుల సంఘానికి క్షమాపణలు చెబుతూ ఓ ప్రకటనను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ విషయంపై కాకపోవచ్చని కూడా సిని వర్గల్లో టాక్.

ఇక గీతా ఆర్ట్స్ విషయానికొస్తే.. అల్లు అరవింద్‌ నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ ఐదు దశాబ్దాలుగా సక్సెస్‌ ఫుల్‌ ప్రొడక్షన్ హౌస్‌గా కొనసాగుతుంది. కేవలం నిర్మాణ రంగంలో మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూషన్‌ రంగంలోనూ విజయ యాత్రను కొనసాగిస్తుంది.

దక్షిణాదినే కాకుండా ఉత్తరాదిన కూడా పలు సినిమాలు నిర్మించి సక్సెస్‌ అయింది. ప్రస్తుతం అల్లుఅరవింద్​ ఆహా మెయిన్​టెయిన్స్​లో ఫుల్​ బిజీ అయిపోయారు. ఆయన కోప్రొడ్యూసర్​గా వ్యవహరించిన అల వైకుంఠపురంలో హిందీ రీమేక్​ రిలీజ్​కు రెడీ అయింది. ఇందులో కృతిసనన్​, కార్తీక్​ ఆర్యన్​ హీరో హీరోయిన్లుగా నటించారు. కాకపోతే ప్రస్తుతం ఆ చిత్రం విడుదల విషయంలో వివాదాల్ని ఎదుర్కొంటోంది.

ఇక తెలుగులో అల్లు అరవింద్ ప్రస్తుతం వినరో భాగ్యము విష్ణు కథ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్​ పై తెరకెక్కిస్తున్నారు. ఈ బ్యానర్ పై ఎన్నో సూపర్ హిట్ మూవీస్ అందించిన అల్లు అరవింద్.. మరోసారి హిట్ కొట్టేందుకు సిద్ధం అయ్యారు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్నారు. మురళి కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్లు ఆకట్టుకుంటున్నాయి. ఇక అల్లు అరవింద్ దేనిగురించి మీటింగ్ పెట్టనున్నారో వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.