Begin typing your search above and press return to search.

వివాదంలో అల్ల‌రి న‌రేష్ చిత్రం..!

By:  Tupaki Desk   |   21 Jan 2021 3:42 PM GMT
వివాదంలో అల్ల‌రి న‌రేష్ చిత్రం..!
X
అల్లరి నరేశ్ అప్ క‌మింగ్ మూవీ ‘బంగారు బుల్లోడు’. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. త్వరలోనే విడుదలకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే.. ఈ మూవీ ట్రైలర్ లో కొన్ని సన్నివేశాలు తమను కించపరిచేలా ఉన్నాయంటూ స్వర్ణ కార సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తమ వృత్తిని అవమానించేలా చిత్రీకరించారని ఫైర్ అవుతున్నాయి.

ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘాలు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఫిర్యాదు చేశాయి. తమ వృత్తిని కించ‌ప‌రిచేలా ఉన్న స‌న్నివేశాల‌ను సినిమాలోంచి తొలగించాలని ఆయా సంఘాల నేత‌లు డిమాండ్ చేశారు. గురువారం ఫిలిం చాంబ‌ర్లో వినతి పత్రాలు అందజేశారు.

ఒకరి బంగారు ఆభరణాలను వేరొకరి వేడుకలకి స్వర్ణకారులు ఇచ్చార‌ని ట్రైలర్‌లో చూపించార‌ని, కానీ.. స్వ‌ర్ణ‌కారులు ఎవ‌రూ అలా చేయ‌ర‌ని అన్నారు. ఈ స‌న్నివేశాలు స్వర్ణకారులను కించపరిచేవే అని ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ అన్నారు.

సినిమాలో స్వర్ణ కారులపై ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నా.. వెంటనే తొలగించాలని కోరారు. అంతేకాకుండా.. రిలీజ్‌కు ముందు ప్రివ్యూ వేయాలని, లేదంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాని అడ్డుకుంటామని అన్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు గిరి.పి దర్శకత్వం వహించారు. అల్లరి నరేశ్‌కు జోడీగా హీరోయిన్‌ పూజా జవేరి నటించింది. ఈనెల 23న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు మేక‌ర్స్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.