Begin typing your search above and press return to search.

ఆ హీరో ఈసారైనా నాందితో హిట్లకు నాంది పలుకుతాడా..?

By:  Tupaki Desk   |   26 May 2020 6:50 AM GMT
ఆ హీరో ఈసారైనా నాందితో హిట్లకు నాంది పలుకుతాడా..?
X
తెలుగు సినీ పరిశ్రమలో హీరో అల్లరి నరేష్ పేరు వింటే ఫేసులో ఓ మంచి స్మైల్ వస్తుంది. ఎందుకంటే అల్లరి నరేష్ సినిమాలు అంటేనే చాలా అల్లరితో సందడిగా ఉంటాయి. కెరీర్ ప్రారంభంలోనే అల్లరి అనే మంచి యూత్ ఫుల్ హిట్ అందుకున్నాడు. ఇక తన మొదటి హిట్ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకుని అల్లరి నరేష్ గా ఫేమస్ అయ్యాడు. అల్లరి నరేష్ సినిమాలలో నటన, కామెడీ టైమింగ్ తో పాటు మంచి పేరును సంపాదించుకున్నాడు. సీనియర్ హీరోలు రాజేంద్రప్రసాద్, నరేష్ ల తర్వాత అంతటి పేరును పొందిన హీరో అల్లరి నరేష్ మాత్రమే. హెల్తీ కామెడీ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని పెద్ద హీరోలకు ధీటుగా సినిమాలు చేసాడు.

కానీ గత రెండేళ్లుగా తన నుండి హీరోగా అల్లరి నరేష్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. గతేడాది మహర్షి మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసాడు తప్ప హీరోగా రాలేదు. ఫ్రెండ్ గా సక్సెస్ అయ్యాడు.. కానీ ప్రేక్షకులు ఆశించిన అల్లరి అందులో లేదు. ప్రస్తుతం అల్లరి నరేష్ కామెడీ శైలికి పూర్తి భిన్నంగా వినూత్న కథ, కథనాలతో ఓ సినిమా చేస్తున్నాడు. అల్లరి న‌రేష్ కెరీర్లో 57వ సినిమాగా సామాజిక కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు "నాంది" అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అల్లరి నరేష్ కెరీర్లో ఇదివరకు నేను, గమ్యం, శంభో శివ శంభో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందాడు. ఈ సినిమా కూడా ఆద్యంతం ఆసక్తికరంగా సామాజిక అంశాల మేళవింపుతో క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

డైరెక్టర్ సతీష్ వేగేశ్న నిర్మాతగా మారి నిర్మిస్తున్న ఈ సినిమాతో విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అయితే రంజాన్ పండగ సందర్బంగా నాంది సినిమా డబ్బింగ్ పనులు ప్రారంభం అయ్యాయి. ఇక సోమవారం అల్లరి నరేష్ తన పాత్రకు డబ్బింగ్ ప్రారంభం చేసాడట. అయితే ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు చేయడం అల్లరి నరేష్ కి కొత్తేమి కాదు. ఇదివరకు చేసిన భిన్న సినిమాలన్నీ ఆకట్టుకున్నాయి. మరి చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ చేస్తున్న విభిన్న సినిమా ఇది. మరి ఈ సినిమాతో అయినా ప్రస్తుతం ప్లాప్ లకు బ్రేక్ వేస్తాడా లేదా అని అభిమానులు అనుకుంటున్నారు. చూడాలి మరి రెండేళ్ల తర్వాత అయినా సోలోగా హిట్ కొడతాడేమో!