Begin typing your search above and press return to search.

తెలుగుతో మనసు దోచుకున్న అమెరికన్!

By:  Tupaki Desk   |   13 July 2019 10:16 PM GMT
తెలుగుతో మనసు దోచుకున్న అమెరికన్!
X
ఇది సోషల్ మీడియా జెనరేషన్. కళ్ళు మూసి తెరిచేలోపు ఒక వీడియో పాపులర్ అవుతుంది. ఓవర్నైట్ ఒక వ్యక్తి పాపులర్ అవుతారు. అలా లేటెస్ట్ గా పాపులర్ అయిన వ్యక్తి ఐజాక్ రిచర్డ్స్. ఈ పేరు చెప్పగానే ఎవరు? అని మీరు అనుకోవచ్చు కానీ ఈమధ్య ఒక స్మాల్ రెస్టారెంట్ లో ఫారినర్ స్పష్టంగా తెలుగు మాట్లాడిన వీడియో చూశారా అంటే వెంటనే.. 'అవును' అంటారు. ఫేస్ బుక్.. ట్విట్టర్.. వాట్సాప్ అనే తేడా లేకుండా ఈ వీడియో పాపులర్ అయింది.

దీంతో ఈ వీడియో గురించి న్యూస్ ఛానెల్స్ లో కూడా కథనాలు వచ్చాయి. అయితే ఆ కథనాల్లో ఈ తెలుగు మాట్లాడినవారు న్యూజీలాండ్ కు చెందిన వ్యక్తి అని చెప్పారు కానీ అది నిజం కాదు. ఈ వ్యక్తి పేరు ఐజాక్ రిచర్డ్స్.. అమెరికాలోని మోంటానా రాష్ట్రంలోని వెస్ట్ స్టోన్ లో ఉంటారు. అక్కడే ఒక ఐస్ క్రీమ్ పార్లర్ లో పనిచేస్తారు. తాజాగా ఈ ఐజాక్ మరో వీడియో విడుదల చేయడం జరిగింది. ఇందులో "నేను ఆంధ్ర ప్రదేశ్ లో 2016 లో నుండి 2018 వరకూ ఉన్నాను. విశాఖపట్నం లో ఒక సంవత్సరం.. విజయవాడలో ఒక సంవత్సరం ఉన్నాను. నాకు తెలుగు భాష నచ్చడంతో నేర్చుకున్నాను. ఇక్కడ మోంటానాలో నేను ఐస్ క్రీమ్ షాప్ లో పని చేస్తున్నాను.. ఇక్కడకు ఇండియన్ టూరిస్టులు చాలామంది వస్తుంటారు. వారితో నేను తెలుగులో మాట్లడతాను. ఈమధ్య అలాగే మాట్లాడితే నాకు వీడియో తీశారు. నాకు ఎందుకు వీడియో తీస్తున్నారు.. నేను ఇలా తెలుగు మాట్లాడడం అదేం పెద్ద విషయం అనుకున్నాను. కానీ ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత చాలా వ్యూస్ వచ్చాయి నేను నమ్మలేకపోయాను. నాకు తెలుగు చాలా నచ్చింది. ఎల్లప్పడూ నా గుండె అక్కడ ఇకపై నేను తెలుగు వీడియోస్ పోస్ట్ చేయాలని అనుకుంటున్నా." అంటూ మాట్లాడాడు.

ఈ వీడియోకు కూడా భారీ స్పందన దక్కింది. టాలీవుడ్ సెలబ్రిటీ మంచు లక్ష్మి ఈ వీడియోకు "నా తెలుగు కంటే అతని తెలుగు బాగుంది. ఇలా మన తెలుగు భాషను ఆదరించడం ఎంతో సంతోషంగా ఉంది" అంటూ రిప్లై ఇచ్చారు. మరోవైపు యాక్టర్ బ్రహ్మాజీ "నీ దుంప తెగ ఎంత బాగా మాట్లాడుతున్నావ్" అంటూ ట్వీట్ చేశారు. ఏదైతేనేం ఇప్పుడు ఐజాక్ రిచర్డ్స్ తెలుగు నాట యమా ఫేమస్ అయ్యాడు. భళా ఐజాక్ బాబు భళా!


వీడియో కోసం క్లిక్ చేయండి