వీడియో : తమన్నాకు ఆల్ ది బెస్ట్ చెప్పిన విలక్షణ నటుడు

Tue Jul 20 2021 16:02:25 GMT+0530 (IST)

All the Best tamanna Says Vijay Sethupathi

మిల్కీ బ్యూటీ తమన్నాకు విజయ్ సేతుపతి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.. నువ్వు చేయగలవు అంటూ ధైర్యం చెప్పి మరీ పంపిస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా ముద్దుగా బేబీ అంటూ విజయ్ సేతుపతిని పిలవడంతో పాటు అందంగా కనిపించడంతో ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జెమిని టీవీలో తమన్నా హోస్టింగ్ చేయబోతున్న మాస్టర్ చెఫ్ ప్రమోషన్ లో భాగంగా ఈ వీడియోను విడుదల చేశారు. జెమిని టీవీ ప్రతిష్టాత్మకంగా తీసుకు వస్తున్న మాస్టర్ చెఫ్ షో కోసం తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమన్నా ఇప్పటికే ఓటీటీ ద్వారా ఒక షో ను చేయాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల ఆ షో క్యాన్సిల్ అయ్యింది. ఎట్టకే జెమిని టీవీ లో మాస్టర్ చెఫ్ ను అతి త్వరలోనే ప్రసారం చేయబోతున్నారు.అందంతో పాటు మంచి ఆకట్టుకునే మాటకారితనం ఉన్న తమన్నా మాస్టర్ చెఫ్ తో కొత్త జెర్నీ ప్రారంభించబోతుంది. తన కొత్త యాంగిల్ ను తమన్నా చూపించబోతున్న నేపథ్యంలో బుల్లి తెర ప్రేక్షకులు మస్క్ ఎంటర్ టైన్ మెంట్ ఖాయంగా కనిపిస్తుంది. ఇటీవల విజయ్ సేతు పతి మరియు తమన్నాలపై ప్రోమోను షూట్ చేయడం జరిగింది. తాజాగా విడుదల అయిన ప్రోమో తో పాటు విజయ్ సేతుపతి నుండి మరి కొన్ని ప్రోమోలు కూడా వస్తాయని అంటున్నారు. తమన్నా మరియు విజయ్ సేతుపతిలు మాస్టర్ చెఫ్ పై అంచనాలు భారీగా పెంచుతున్నారు.

తమన్నా హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తూ వెబ్ సిరీస్ ల్లో కూడా నటించడంతో పాటు ఈమె ఇలా బుల్లి తెరపై షో లను చేయడం వల్ల మరింతగా ప్రేక్షకులకు దగ్గర అవుతోంది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో తో పాటు ఈ షో ను కూడా జెమిని వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని టెలికాస్ట్ కు సిద్దం చేస్తున్నారు. తమన్నా వంటలు చేయిస్తూ సెలబ్రెటీలతో చిట్ చాట్ చేస్తుంది. ఆ షో కోసం తమన్నా తనకు పరిచయం ఉన్న ఎంతో మంది ప్రముఖులను తీసుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు బుల్లి తెరపై ఎన్నో టాక్ షో లు వచ్చాయి. వాటన్నింటికి ఈ షో ఎంత వరకు విభిన్నంగా ఉంటుంది అనేది చూడాలి.