అందగత్తెలంతా ఒకచోట చేరితే ఇలాగే ఉంటుంది మరి!

Mon May 23 2022 08:36:23 GMT+0530 (IST)

All the Beauties at One Place

చిత్రపరిశ్రమలో హీరోయిన్స్ గా రాణించడం అనుకున్నంత తేలికేం కాదు. అందం పరంగా .. అబినయం పరంగా ఇక్కడ గట్టి పోటీ ఉంటుంది. ఒక్కోసారి ఒకరికి వచ్చిన అవకాశాలు చివరి నిమిషంలో వేరొకరికి వెళ్లిపోతుంటాయి. ఇక్కడ అపార్థాలు రావడానికి .. మనస్పర్థలు తలెత్తడానికి అవకాశాలు ఎక్కువ. అందువలన ఇక్కడ స్నేహాలను కాపాడుకోవడం .. నిలబెట్టుకోవడం  చాలా కష్టమైన విషయం. అయినా అక్కడక్కడ ఒకరిద్దరు హీరోయిన్స్ తప్ప అందరూ ఎంతో స్నేహంగా  తన కెరియర్ ను కొనసాగించడమే ఎక్కువగా కనిపిస్తూ వస్తోంది.సీనియర్ హీరోయిన్స్ ఇప్పటికీ తమ ఫ్రెండ్షిప్ ను కొనసాగిస్తూ ఉండగా. యంగ్ హీరోయిన్స్ ఇలా పరిచయమై అలా అల్లుకుపోతున్నారు. తమ ఇమేజ్ ను పక్కన పెట్టేసి ఒకరితో ఒకరు సరదాగా కలిసిపోతున్నారు. ఎక్కడ కలుసుకున్నా అందమైన అల్లరి చేస్తూ అభిమానులకు కావలసినంత సందడిని పంచుతున్నారు. సాధారణ రోజుల్లో కలుసుకోవడం వాళ్లకి కుదరదు .. ఎవరి షూటింగులలో వాళ్లు చాలా బిజీగా ఉంటారు. అందువలన వీళ్లంతా కలుసుకోవాలంటే అవార్డుల ఫంక్షన్ల వంటివి జరగాల్సిందే. అప్పుడు వాళ్లంతా కూడా అందమైన సీతాకోకచిలుకల మాదిరి ఒకచోట తళుక్కున మెరుస్తారు.

అలాంటి ఒక అవార్డుల ఫంక్షన్లో సాయిపల్లవి .. కృతి శెట్టి .. ప్రియాంక అరుళ్ మోహన్ .. కల్యాణి ప్రియదర్శన్ కలుసుకున్నారు. కామాలు  లేకుండా కబుర్లు చెప్పుకున్నారు .. మురిసిపోతూ  ముచ్చట్లు పంచుకున్నారు. ఎవరి హడావిడిలో వాళ్లు ఉండగా ఈ భామలంతా ఒక సెల్ఫీ కొట్టేశారు. ఈ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు.

సాయిపల్లవి విషయానికి వస్తే తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో ఆమె కి మంచి క్రేజ్ ఉంది. నటన పరంగా సౌందర్య తరువాత స్థానంలో .. డాన్స్ పరంగా భానుప్రియ తరువాత స్థానంలో ఆమె పేరును చెప్పుకుంటున్నారు. తెలుగు లో ఆమె చేసిన 'విరాటపర్వం' విడుదలకి సిద్ధంగా ఉంది.

ఇక తెలుగులో కృతి శెట్టి జోరు మామూలుగా లేదు. ఆల్రెడీ హ్యాట్రిక్ హిట్ కొట్టేసిన ఈ బ్యూటీ మరో మూడు సినిమాలను లైన్లో పెట్టేసింది. సూర్య సినిమాతో కోలీవుడ్ కి కూడా పరిచయమవుతుండటం విశేషం. ప్రియాంక అరుళ్ మోహన్ విషయానికి వస్తే నాజూకుదనానికే నమూనాగా కనిపిస్తుంది. తెలుగులో సక్సెస్ లు పలకరించకపోయినా ఇప్పుడిప్పుడే తమిళంలో బిజీ అవుతోంది.

ఇక కల్యాణి ప్రియదర్శన్ విషయానికొస్తే రీసెంట్ గా మలయాళంలో రెండు హిట్స్ కొట్టేసింది. అక్కడే ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్ స్టాలో ఆమె షేర్ చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎక్కువ లైక్స్ .. కామెంట్స్ పడుతుండటం విశేషం.