కన్ఫర్మ్ చేసిన అలియాభట్

Tue May 24 2022 16:01:30 GMT+0530 (IST)

Aliabhatt New Movie on Netflix

బాలీవుడ్ మోస్ట్ క్రేజీ బ్యూటీ ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ లని వింటూ ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన వివాదాస్ప చిత్రం 'గంగూభాయి కతియావాడి' చిత్రంతో మాసీవ్ హిట్ ని సొంతం చేసుకుంది అలియా భట్. ఆ వెంటనే పాన్ ఇండియా మూవీ 'ట్రిపుల్ ఆర్'తో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. తెలుగులో తొలిసారి అలియాభట్ నటించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఐదు భాషల్లో విడుదలై రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సినిమాలో అలియా కనిపించింది తక్కువ సమయమే అయినా సీత పాత్రలో ఒదిగిపోయిన తీరు ప్రతీ ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకుంది. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ మూవీ దేవ వ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించి అలియా భట్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని చేర్చింది.

ఈ శుభ సందర్భాన్ని ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పెళ్లి వార్తని చెప్పేసింది అలియా. హీరో రణ్ బీర్ కపూర్ తో పెళ్లి కోసం గత కొంత కాలంగా ఎదురుచూస్తున్న అలియాభట్ 'ట్రిపుల్ ఆర్ ' తరువాత రణ్ బీర్ తో కలిసి పెళ్లిపీటలెక్కేసింది. తను కోరుకున్న హీరోని పెళ్లిచేసుకుని ఆనందక్షనాల్ని ఆస్వాదిస్తోంది.

ఇలా వరుస గుడ్ న్యూస్ లతో కెరీర్ పరంగా వ్యక్తిగత జీవితం పరంగా బెస్ట్ ఫేజ్ ని ఎంజాయ్ చేస్తోంది అలియా. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన మరో గుడ్ న్యూస్ ని నెట్స్ఫ్లిక్స్ తాజాగా ఓ వీడియో ద్వారా గమ్మత్తుగా ప్రకటించింది. ట్రిపుల్ ఆర్ తరువాత అలియా భట్ నటించిన చిత్రం 'డార్లింగ్స్'. జస్మీత్ కె రీన్ దర్శకత్వం వహించారు. అలియాభట్ నటించి షారుక్ ఖాన్ వైఫ్ గౌరీఖాన్ అండ్ గౌరవ్ వర్మతో కలిసి ఈ మూవీని నిర్మించింది.

ఇందులో అలియాతో పాటు షెఫాలీషా విజయ్ వర్మ రోషన్ మాథ్యూ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించిన ఓ వీడియోని నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది.

అలియా ఫోన్ మాట్లాడుతూ 'డార్లింగ్స్' నెట్ అంటూ వుండగా ఓ వ్యక్తి మైక్ పట్టుకుని ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేస్తున్నారట కదా? అని అడిగితే తప్పించుకుంటూ సమాధానం దాటవేస్తూ ఫైనల్ గా కారవాన్ లోకి వెళ్లి త్వరలో కలుద్దాం అంటూ క్లారిటీ ఇచ్చిన తీరు మిగత వారు కూడా ఇదే తరహాలో మాట్లాడి చివరికి ఫైనల్ గా యష్ అంటూ ముగించడం ఆకట్టుకుంటోంది.