కరణ్ వాడకానికి.. ఆమె సైతం దండం పెట్టేసిందట

Fri Sep 30 2022 10:03:36 GMT+0530 (India Standard Time)

Do you know Alia's reaction to Karan's use?

బాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ కమ్ దర్శకుడు కరణ్ జోహార్. తన పేరునే బ్రాండ్ గా తయారు చేసుకున్న అతగాడి శక్తిసామర్థ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తరహా నిర్మాత కమ్ దర్శకుడు బాలీవుడ్ లో మరొకరు లేరు. ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూ.. మరోవైపు తనదైన ప్రత్యేక షోలు.. ఇతర రియాల్టీ షోలకు జడ్జిగా వెళ్లటం లాంటివిఆయనకు మాత్రమే సాధ్యం.ఆయన నిర్వహించే కాఫీ విత్ కరణ్ కు.. పెద్ద పెద్ద సెలబ్రిటీలు పని కట్టుకొని రావటం.. ఆయన వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పటమే కాదు.. ఆయన షో అంటే కచ్ఛితంగా ఉంటే రొమాంటిక్ క్వశ్చన్లకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. అలాంటివి మరే షోలో అడిగినా.. ముఖం పగిలే సమాధానాలు చెబుతారు. కానీ.. అడిగేది కరణ్ జోహార్ కావటంతో కత్రినా మొదలు కరీనా వరకు అందరూ ముఖానికి నవ్వు తగిలించుకొని మరీ ఇబ్బంది పడుతూ చెప్పేస్తుంటారు.

ఇటీవల కాలంలో తన కాఫీ విత్ కరణ్ షోలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రస్తావన తరచూ తేవటం తెలిసిందే. దీనికి సంబంధించిన ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సరికొత్త కరణ్ షోకు జ్యూరీగా వ్యవహరిస్తున్న పలువురు సోషల్ మీడియా సెలబ్రిటీలు..కమెడియన్స్ పాల్గొన్నారు. ఇందులో నెటిజన్ల నుంచి ఎక్కువగా వచ్చిన ట్రోల్స్ పై కరణ్ రియాక్టు అయ్యారు.

ఈ ట్రోల్స్ లో చాలా ఎపిసోడ్స్ లో అలియా భట్ పేరును ప్రస్తావించారని.. అవసరం లేకున్నా ఇది జరిగిందన్నారు. దీనికి స్పందించిన కరణ్.. 'ఈ మధ్యన ఇదే విషయం మీద నేను.. అలియా మాట్లడుకున్నాం. ఆమె నాతో.. మీరు చూపిస్తున్న అభిమానానికి థ్యాంక్స్. ఇకపై నా పేరు ఎక్కువగా వాడొద్దని చెప్పింది. అలియా మాట ప్రకారమే ఆ తర్వాత నుంచి కాఫీ విత్ కరణ్ షోలో వీలైనంత తక్కువగా ఆమె గురించి మాట్లాడాను' అని చెప్పుకొచ్చారు.

అక్కడి వరకు బాగానే ఉన్నా.. తన పేరును ఎక్కువగా ప్రస్తావించొద్దని అలియా పేరును ప్రస్తావించిన కరణ్.. తానీ షోకు ధరించిన ఇటాలియా అన్న పేరు రాసి ఉన్న జాకెట్ వేసుకొని వచ్చారని.. దాన్ని చూసి అందరూ అలియాను ప్రమోట్ చేసేందుకు వేసుకొచ్చానని అనుకుంటున్నట్లు చెప్పారు.

అది అలియా కాదు ఇటాలియా అంటూ.. మళ్లీ అలియా ప్రస్తావన తేవటం గమనార్హం. మొత్తానికి కరణ్ తన పేరు వాడకంపై అలియా సైతం అలిసిపోయిందన్న విషయం కరణ్ మాటలతో అర్థమైందని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.