ఏంటా పిల్ల చేష్టలు! తాతయ్యను ఆటపట్టిస్తావా ఆలియా?

Sat Jun 19 2021 06:00:01 GMT+0530 (IST)

Alia is having fun with her 93 year old grandfather

పార్టీలు ఫంక్షన్లు అంటే ఆటవిడుపు. చిలౌట్ చేయనిదే లైఫ్ లో మస్త్ మజా ఏం ఉంటుంది? ఆలియా అంటేనే జాలియా అని మీనింగ్. ఛాన్స్ దొరికిందంటే చాలు ఫుల్ గా విందువినోదంలో తేల్తుంది. అప్పట్లో ప్రియుడు రణబీర్ తో కలిసి ఫుల్ గా విదేశీ విహారాలు చేసిన ఆలియా కొంతకాలంగా లాక్ డౌన్ లో ఇంట్లోనే రిలాక్స్ డ్ గా ఉంది. కోవిడ్ సోకడంతో జోష్ కొంత తగ్గింది. కొద్దిరోజుల క్రితమే తాను కోలుకున్నానని తెలిపిన ఆలియా తదుపరి భన్సాలీ మూవీ కోసం సెట్స్ కి వెళ్లేందుకు సిద్ధమైంది. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణకు రెడీ అవుతోందని సమాచారం.బుధవారం సాయంత్రం తన తాత (సోని రజ్దాన్ తండ్రి)గారి 93 వ పుట్టినరోజు వేడుకలో అలియా భట్ సందడి ఆషామాషీగా లేదు. ప్రత్యేక అతిథులు సమక్షంలో అలియా ఎంతగా అల్లరి చేసిందో ఇదిగో ఈ ఫోటోలు చెప్పకనే చెబుతున్నాయి. ప్రియుడు రణబీర్ కపూర్ అతని కుటుంబం భట్ నివాసంలో పార్టీకి విచ్చేశారు. అక్కడ సోనీ రజ్దాన్.. షాహీన్ తో కలిసి ఫోటోలు దిగారు.

ఇన్ స్టాగ్రామ్ లో రణబీర్ సోదరి రిద్దిమా కపూర్ సాహ్ని ఈ ఫోటోని షేర్ చేయగా వైరల్ అయ్యింది. ఇందులో అలియా తాతగారితో సందడి చేస్తుంటే రణబీర్ ఫోటో క్లిక్  చేశాడు. మరొక షాట్ లో ఆలియా- షాహీన్ .. సమారా (రిద్దిమా కుమార్తె) ఉన్నారు. తన తల్లితోనూ ఆలియా కనిపించింది. ఈ పార్టీకి రణబీర్ కపూర్ తల్లి నీతు కపూర్ కూడా హాజరయ్యారు.

2018 లో సోనమ్ కపూర్ - ఆనంద్ అహుజా వివాహ రిసెప్షన్ లో జంటగా కలిసి కనిపించిన తర్వాత అలియా భట్ - రణబీర్ కపూర్ ప్రేమ గురించి పుకార్లు మొదలయ్యాయి. అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్ట్రలో జంటగా నటించారు. ఆ తర్వాత ఈ జంట ప్రేమ కన్ఫామ్ అయ్యింది. ఈ జంట పెళ్లి గురించి అభిమానుల్లో చర్చ సాగుతున్నా రకరకాల కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.