అలియా భట్ పై ఆశలు వదులు కోవాల్సిందేనా?

Mon Sep 26 2022 18:04:48 GMT+0530 (India Standard Time)

Alia bhatt on Heart of Stone Netflix

హాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు సొంతం చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ కావాలని మన ఇండియన్ నటీనటులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. గతంలో అమ్రిష్ పురి ఇర్ఫాన్ ఖాన్ ఐశ్వర్యారాయ్ వంటి స్టార్లకు హాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశం లభించింది కానీ వారికి ప్రాధాన్యమున్న పాత్రలు మాత్రం దగ్గలేదు. ఇటీవల ప్రియాంక చోప్నా హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తనక తగ్గ పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది.ఇక ఇటీవల దక్షిణాది నుంచి వెర్సటైల్ హీరోగా పేరు తెచ్చుకున్న ధనుష్ హాలీవుడ్ కు పరిచయమయ్యాడు. ధనుష్ నటించిన తొలి హాలీవుడ్ మూవీ  `ది ఎక్స్ ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్`. కెన్ స్కాట్ రూపొందించిన ఈ మూవీ తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇక `అవెంజర్స్ ఎండ్ గేమ్` మూవీ డైరెక్టర్స్ రుస్సో బ్రదర్స్ రూపొందించిన `ది గ్రే మ్యాన్`లో నటించాడు. ఈ మూవీ అయినా భారీ విజయాన్ని అందించి ధనుష్ కు మంచి పేరు తెచ్చిపెడుతుంది అనుకుంటే మళ్లీ నిరాశే ఎదురైంది.

ఇదిలా వుంటే ధనుష్ తరువాత హాలీవుడ్ కు అలియా భట్ పరిచయం అవుతోంది. అలియా నటిస్తున్న తొలి హాలీవుడ్ ఫిల్మ్ `హార్ట్ ఆఫ్ స్టోన్`. వండర్ ఉమెన్ ఫేమ్ గాల్ గాడోట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీని టామ్ హార్పర్ రూపొందించాడు. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో వచ్చే ఏడాది స్ట్రీమింగ్ కాబోతోంది. ఇటీవల `దుడమ్` ఈవెంట్ లో భాగంగా నెట్ ఫ్లిక్స్ వచ్చే ఏడాది రిలీజ్ కానున్న సినిమాలు వెబ్ సిరీస్ ల టీజర్ లు ట్రైలర్ లని రిలీజ్ చేసింది.

ఇందులో ఇండియన్ కంటెంట్ తో పాటు కొరియన్ కంటెంట్ కూడా వుంది. ఇక ఇదే వేదికపై హాలీవుడ్ సినిమాల టీజర్ లని కూడా రిలీజ్ చేసింది. అందులో అలియాభట్ నటింటిచిన `హార్ట్ ఆఫ్ స్టోన్` కూడా వుంది. దీంతో ఈ మూవీ మన వాళ్లకు అత్యంత స్పెషల్ గా నిలిచింది. ఈ మూవీలో అలియా భట్ తో పాటు `వండర్ ఉమెన్` ఫేమ్ గాల్ గాడోట్ నటిస్తోంది. సినిమాలో  గాల్ గాడోట్ గూడచారిగా నటిస్తుండగా అలియా మాత్రం ఇండియన్ యువతి కియా ధావన్ గా కనిపించబోతోంది.

అయితే ఇందులో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యం వున్నట్టుగా కనిపించడం లేదని తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ ని చూసిన వాళ్లంతా పెదవి విరుస్తున్నారు. ధనుష్ ని `గ్రే మ్యాన్ `లో చిన్న పాత్రలో చూపించినట్టుగానే `హార్ట్ ఆఫ్ స్టోన్` లోనూ గాల్ గాడోట్ ని ప్రధాన పాత్రలో చూపించి అలియా భట్ కు ప్రాధాన్య లేని పాత్ర ఇచ్చి వుంటారని అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. ఫస్ట్ లుక్ వీడియో ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. హాలీవుడ్ వాళ్ల తీరుపై విమర్శలు చేస్తున్న నెటిజన్స్ అప్పుడు ధనుష్ ని.. ఇప్పడు అలియాని ఇండియన్ మార్కెట్ కోసం భలే వాడేసుకుంటున్నారని కామెంట్ లు చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.