దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీగా రాంచరణ్ భామ రికార్డు!!

Tue Jul 14 2020 14:20:48 GMT+0530 (IST)

Rancharan Heroine's record as the most popular celebrity in the country !!

ప్రముఖ మాక్స్ స్టార్స్ అండ్ ఇండియా లవ్స్ పత్రిక తాజాగా దేశంలో ఈ నెల టాప్ టెన్ మహిళా సెలబ్రిటీల జాబితా విడుదల చేసింది. ఇలా టాప్ సెలబ్రిటీల జాబితా ప్రతీ నెల విడుదల చేస్తుంది. అయితే ఈ నెలలో యంగ్ బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ రెండవ స్థానం కైవసం చేసుకుంది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన రెండవ మహిళా సెలబ్రిటీగా ఎంచుకోబడింది అలియా. గత నెల జాబితాలో అలియా అగ్రస్థానంలో ఉంది. కానీ ప్రతీ జాబితాలో అలియా టాప్ లోనే ఉండటం విశేషం. ఈ విషయంలో ఆమెను మెచ్చుకోవాల్సిందే. ఈ మధ్య ఇండస్ట్రీలో నెపోటిజమ్ గురించి విమర్శలు ఎదుర్కున్న సెలబ్రిటీలలో అలియా కూడా ఉంది. కానీ ఎవరు ఏమనుకున్నా.. అలియా తన సొంత ప్రతిభతో.. తన అద్భుతమైన నటనతో అవకాశాలు అందిపుచ్చుకుంటుందని తెలిసిందే అంటున్నారు.కానీ ఇప్పటి వరకు అలియా పోషించిన పాత్రలు.. పెర్ఫార్మన్స్ లు అన్నీ ప్రజల మెప్పు పొందినవే అని అంగీకరించాలి. అయితే ఈ నెల మాక్స్ స్టార్స్ ఇండియా లవ్స్ మొదటి స్థానంలో నిలిచింది దీపిక పదుకోనె. ఆ తర్వాత కత్రినా 3 కరీనా 4 శ్రద్దా కపూర్ 5 స్థానాలలో నిలిచారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే.. అలియా భట్ పేరే వినిపిస్తుంది. అలాగే బిజీ హీరోయిన్లలో ఎవరంటే కూడా అలియా పేరే ముందుంటుంది. ఇప్పుడు ఆమె చేతిలో అన్నీ పెద్ద సినిమాల ప్రాజెక్టులే ఉన్నాయి. ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'రౌద్రం రుధిరం రణం' (ఆర్ఆర్ఆర్) సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. కానీ కరోనా కారణంగా ఇంటికే పరిమితం అయిన అలియా.. చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ గురించి జాగ్రత్త పడుతోందట. మరి అల్లూరి సీతారామరాజు ప్రేయసిగా కనిపించనున్న అలియా తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి!

TAGS: Alia Bhatt