Begin typing your search above and press return to search.

ప్ర‌స‌వం తర్వాత తొలిసారి మీడియా కంట ప‌డిన అలియాభ‌ట్!

By:  Tupaki Desk   |   30 Nov 2022 12:31 AM GMT
ప్ర‌స‌వం తర్వాత తొలిసారి మీడియా కంట ప‌డిన అలియాభ‌ట్!
X
బాలీవుడ్ న‌టి అలియాభ‌ట్ ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో యాక్టివ్ అయిన సంగ‌తి తెలిసిందే. పాపాయికి జ‌న్మ‌నిచ్చే క్ర‌మంలో కొన్ని రోజుల పాటు అంద‌రికీ దూరంగా ఉన్నా అలియా ప్ర‌స‌వం త‌ర్వాత బిడ్డ గురించి అప్డేడ్స్ సైతం ఇచ్చేసారు. త‌న గారాల ప‌ట్టికి ఎలాంటి పేరు పెడుతున్నారో హింట్ కూడా ఇచ్చారు. తాజాగా అలియాభ‌ట్ ఏకంగా ఈసారి కెమెరా ముందుకే వ‌చ్చేసారు.

త‌న సోద‌రి షాహీన్ బ‌ట్ పుట్టిన రోజు సంద‌ర్భంగా అలియా త‌ల్లితో పాటు విష్ చేయ‌డానికి విచ్చేసారు. షాహీన్ పార్టీ ఏర్పాటు చేయ‌డంతో తల్లితో పాటు అలియా క‌నిపించింది. ఈక్ర‌మంలో ఇద్ద‌రు మీడియా కంట‌ప‌డ్డారు. అనంత‌రం త‌ల్లీ-కుమార్తె కెమెరాకి ఫోజులిచ్చారు. అటుపై అక్క‌డ నుంచి వెనుదిరిగారు. అలియా భ‌ట్ స్పాట్ లో సాధార‌ణ‌ న‌లుపు రంగు దుస్తుల్లో క‌నిపించారు.

ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇక అలియాభ‌ట్ ముఖం స‌హా శ‌రీరంలో కొన్ని ర‌కాల మార్పులు క‌నిపిస్తున్నాయి. ప్ర‌స‌వం జ‌రిగిన నేప‌థ్యంలో శ‌రీరంలో ఈ ర‌క‌మైన మార్పులు స‌హ‌జ‌మే. ముఖం ఉబ్బిన‌ట్టుగా క‌నిపిస్తుంది. అలాగే రూప లావ‌ణ్యంలో మార్పులొచ్చాయి. మునుప‌టంత గ్లో ముఖంలో క‌నిపించ‌లేదు.

ఇంకొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే త‌ప్ప‌! అలియా హీరోయిన్ లుక్ లోకి రాలేదు. అలియాభ‌ట్ గ‌ర్భం దాల్చిన ద‌గ్గ‌ర నుంచి మీడియాలో హైలైట్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. బేబి బంప్ లుక్ తోనే సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌కు ఎంతో ఉత్సాహాంగా హాజ‌రైంది. అంత‌కు ముందు ఓ హాలీవుడ్ సినిమా కోసం భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల్లో సైతం పాల్గొంది.

నెల‌లు నిండిన స‌మ‌యంలోనూ సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది. ప్ర‌స‌వం త‌ర్వాత అదే యాక్టివ్ నెస్ ని కొన‌సాగించింది. అలియా భ‌ట్ లో వేగం చూస్తుంటే త్వ‌ర‌లో సినిమా షూట్ కి సైతం హాజ‌ర‌య్యే ట‌ట్లు క‌నిపిస్తుంది. ఏమంటావ్ అలియా? ఇప్ప‌టికే అలియాభ‌ట్ కొన్ని సినిమాల‌కు సంత‌కం చేసి రెడీగా ఉంది. వాటిని వీలైనంత త్వ‌ర‌గా ప్రారంభించాల‌ని ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు వెయిట్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.