Begin typing your search above and press return to search.

ఆలియాని రంగీలారాణి అంటూ పొగిడేశాడు

By:  Tupaki Desk   |   4 Dec 2021 3:30 AM GMT
ఆలియాని రంగీలారాణి అంటూ పొగిడేశాడు
X
అందాల క‌థానాయిక ప్ర‌తిభావ‌ని అలియాభ‌ట్ సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫోటోషూట్ల‌ను అప్ లోడ్ చేస్తూ అభిమానుల్లో జోష్ ని నింపుతోంది. త‌న‌లో బోల్డ్ యాంగిల్ తో పాటు ట్రెడిష‌న‌ల్  కోణాన్ని వైవిధ్యాన్ని ఆవిష్క‌రించ‌డం అలియా ప్ర‌త్యేక‌త‌. తాజాగా ఈ బ్యూటీ కొత్త ఫోటో షూట్ లో పాల్గొంది. ఇందులో మ‌త్తెక్కించే డిజైన‌ర్ లుక్ వాలు చూపుల‌తో కెమెరాకి ఫోజులిచ్చింది. జీన్స్ ఫ్యాంట్- టీష‌ర్ట్ దానిపై స్వెట్ ష‌ర్ట్ ను ధ‌రించింది. ఈ స్పెష‌ల్ ట్రెండీ లుక్ చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

ప్ర‌స్తుతం ఈ ఫోటోలు ఇన్ స్టాలో వైర‌ల్ గా మారాయి. అయితే ఈ ఫోటోని ఉద్దేశించి బాలీవుడ్ న‌టుడు అర్జున్ క‌పూర్ ఓ కామెంట్ చేసాడు. అలియాభ‌ట్ ని ఈ యాంగిల్ లో చూస్తుంటే రంగీలా రాణీలా క‌నిపిస్తోంద‌ని న‌వ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేసాడు. మరికొంత మంది ఫాలోవ‌ర్స్ ఈ దొంగ‌చాటు ఫోటో సెష‌న్ వ్య‌వ‌హారం ఏంటో? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక అలియా భ‌ట్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. తెలుగులో `ఆర్ ఆర్ ఆర్` లాంటి పాన్ ఇండియా  సినిమాతో లాంచ్  అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కి జోడీగా న‌టిస్తోంది. చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. సంక్రాంతి కానుక‌గా ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది.

ఈ పాన్ ఇండియా చిత్రం రిలీజ్ త‌ర్వాత అలియా క్రేజ్ మ‌రింత పెరుగుతుంది. ద‌క్షిణాది బాష‌ల్లోనూ ఫేమ‌స్ అవుతుంది.ఇక బాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలో చేస్తోంది. ఇప్ప‌టికే `గంగుభాయ్ కథైవాడి` చిత్రం షూటింగ్ పూర్తిచేసింది. `బ్ర‌హ్మాస్త్ర‌`..`రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ క‌థానీ` చిత్రాల్లో న‌టిస్తోంది. `డార్లింగ్స్` అనే మ‌రో చిత్రానికి నిర్మాత‌గాను వ్య‌వ‌హ‌రిస్తోంది.