ఫొటోటాక్ : ఆర్ఆర్‌ఆర్ సీత సింపుల్ అండ్ స్వీట్

Mon Jul 26 2021 21:08:24 GMT+0530 (IST)

Alia Bhatt Simple and Sweet look

బాలీవుడ్ స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చిన ఆలియా భట్ ఆ తర్వాత హీరోయిన్ గా హిందీలో టాప్ స్టార్ గా నిలిచింది. స్టార్ కిడ్ గా ఇండస్ట్రీకి పరిచయం అయినా కూడా ఆమె నటన ప్రతిభ మరియు ఆమె యొక్క అందంతో తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో స్టార్ గా నిలిచింది. ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్స్ జాబితాలో ఆలియా ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆలియా భట్ లేడీ ఓరియంటెడ్ సినిమాతో కూడా ఆకట్టుకుంటూ ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి డిమాండ్ ను కలిగి ఉన్నాయి. అలాంటి ఆలియా భట్ సోషల్ మీడియాలో ఏ ఫొటో షేర్ చేసిన వైరల్ అవుతుంది.ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ను ముగించుకున్న ఆలియా తాజాగా సోషల్ మీడియాలో ఈ ఫొటోను షేర్ చేసింది. బిగ్ హ్యాట్ పెట్టుకుని మేకప్ లేకుండా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంది. ఫొటో షూట్ లతో రెగ్యులర్ గా ఆలియా భట్ అందాలను ఆరబోస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి నాచురల్ ఫొటోలను మేకప్ లేకుండా సింపుల్  లుక్ తో షేర్ చేస్తూ ఉంటుంది.

ఆర్ ఆర్ ఆర్ లో ఈమె పాత్ర గురించి ఇటీవల విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సినిమాపై అంచనాలు పెంచేలా వ్యాఖ్యలు చేశాడు. ఆమె సినిమా లో కనిపించేది కొద్ది సమయమే అయినా కూడా ఓ రేంజ్ లో ఆమె నటన మరియు పాత్ర ఉంటుందని ఆయన అన్నారు. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ నుండి సీత లుక్ తో ఆలియా ఆకట్టుకుంది. సినిమా విడుదల తర్వాత ఆమె నటన విశ్వరూపంను చూపించడంఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ సినిమాలు ప్రస్తుతం ఈమె చేతిలో అరడజను ఉన్నట్లుగా బాలీవుడ్ మీడియా టాక్.