Begin typing your search above and press return to search.

సీత వెళ్లి పోయింది.. దసరా ముందు రానుంది!

By:  Tupaki Desk   |   25 July 2021 4:30 PM GMT
సీత వెళ్లి పోయింది.. దసరా ముందు రానుంది!
X
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ ఆర్‌ ఆర్ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. మూడు రోజుల క్రితం ముంబయి నుండి ఆలియా భట్‌ హైదరాబాద్‌ కు ఈ సినిమా షూటింగ్ కోసం వచ్చిన విషయం తెల్సిందే. ఇద్దరు హీరోలు ఇంకా కీలక నటీనటులు ప్రమోషనల్‌ సాంగ్‌ చిత్రీకరణ లో పాల్గొన్నారు. ఆలియా భట్‌ ప్రమోషనల్‌ సాంగ్ తో పాటు ప్యాచ్‌ వర్క్‌ ఉంటే కంప్లీట్ చేసుకుందట. ఆలియా భట్‌ మరియు హీరో పై జరిపిన షూట్‌ తో కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయ్యింది. అంతే కాకుండా ఆలియా భట్ ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమాకు సంబంధించిన మొత్తం వర్క్ ను కంప్లీట్‌ చేసింది.

ఆమె హిందీ వర్షన్ కు డబ్బింగ్‌ చెప్పే అవకాశం ఉంది. అది ముంబయిలోనే చెప్పేయవచ్చు. ఇక ఆర్‌ ఆర్ ఆర్‌ షూటింగ్‌ ముగియడంతో హైదరాబాద్‌ ను వీడిన సీత అలియాస్ ఆలియా భట్ మళ్లీ సినిమా విడుదల సమయంలో ప్రమోషన్‌ కార్యక్రమాలకు హైదరాబాద్‌ రావాల్సి ఉంటుంది. దసరా ముందు ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా ఆలియా భట్ కనీసం వారం నుండి పది రోజుల పాటు హైదరాబాద్‌ లోనే గడపాల్సి ఉంటుందని మీడియా వర్గాల టాక్‌. బాలీవుడ్‌ లో టాప్ స్టార్‌ హీరోయిన్ గా దూసుకు పోతున్న ఈ అమ్మడు ఆర్ ఆర్‌ ఆర్‌ లో నటించడం వల్ల హిందీలో మంచి డిమాండ్ ఉంది.

సహజంగానే జక్కన్న సినిమా అంటే భారీ క్రేజ్ ఉంటుంది. ఆలియా హీరోయిన్ అంటే మరింత ఎక్కువ ఆసక్తిని అక్కడి ప్రేక్షకులు కలిగి ఉన్నారు. ఆలియా భట్‌ పాత్ర ఆర్‌ ఆర్ ఆర్‌ లో అద్బుతంగా ఉంటుంది అంటూ ఇటీవల రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అల్లూరి సీతారామ రాజు అయిన రామ్‌ చరణ్ కు సీత గా మరదలు పాత్రలో ఆలియా భట్‌ కనిపించబోతుంది. సినిమా లో ఆమె కనిపించేది కొద్ది సమయం అయినా కూడా కథ మొత్తం కూడా ఆమె చుట్టు తిరుగుతుందని యూనిట్‌ సభ్యులు అంటున్నారు. కనుక సినిమా విడుదల తర్వాత ఆమె క్రేజ్ మరింతగా పెరగడం ఖాయం అంటున్నారను.