చుల్ బుల్ పాండే శిష్యుడిగా మన అలీ!

Sat Apr 20 2019 19:08:41 GMT+0530 (IST)

Ali in Salman Khan Dabangg 3 Movie

టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ గత కొంతకాలంగా రాజకీయాల్లో హడావుడిగా ఉన్నాడు కానీ మామూలుగా అయితే ఆయన సినిమాలలోనూ బుల్లి తెర హోస్టుగానూ ప్రేక్షకులను నవ్వించే పనిలో ఊపిరిసలపనంత బిజీగా ఉంటాడు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న అలీకి తాజాగా ఒక క్రేజీ బాలీవుడ్ సినిమాలో ఆఫర్ దక్కింది.బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'దబాంగ్ 3' లో అలీకి అవకాశం లభించింది.  ఈ సినిమాలో సల్మాన్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడని తెలిసిందే. సల్మాన్ టీమ్ లో ఒక కానిస్టేబుల్ పాత్రలో అలీ హిందీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. రీసెంట్ గా అలీ తన కుటుంబంతో పాటుగా సల్మాన్ ను కలిసిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.  ఈ ఫోటోలో అలీ కానిస్టేబుల్ గెటప్ లో ఉండడం విశేషం.

'దబాంగ్' సీరీస్ లో వస్తున్న మూడో సినిమా ఇది. సల్మాన్ ఖాన్ సరసన సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకుడు.  సల్మాన్.. ఆయన తమ్ముడు ఆర్బాజ్ ఖాన్ లు ఈ సినిమా ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్ కు 'దబాంగ్ 3' ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.