అల వైకుంఠపురంలో టీజర్ అప్ డేట్ వాయిదా

Sun Dec 08 2019 13:08:16 GMT+0530 (IST)

Ala vaikunthapuramulo Teaser Release Announcement Postponed

అల్లు అర్జున్.. త్రివిక్రమ్ ల కాంబోలో రూపొందుతున్న 'అల వైకుంఠపురంలో' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా టీజర్ విడుదలకు రెడీ అయ్యింది. టీజర్ విడుదల తేదీ విషయమై నేడు ఉదయం 10 గంటలకు కీలక ప్రకటన చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అఫిషియల్ గా ప్రకటించారు. అల వైకుంఠపురంలో సినిమా టీజర్ లోడింగ్ అంటూ నిన్ననే ప్రకటన వచ్చింది. కాని మెగా ఫ్యాన్ నూర్ భాయ్ మృతితో సినిమా టీజర్ అప్ డేట్ ను వాయిదా వేశారు.గీతా ఆర్ట్స్ అఫిషియల్ ట్విట్టర్ పేజీలో ఈ విషయాన్ని ప్రకటించారు. మెగా ఫ్యామిలీకి ఆప్తుడు.. మెగా ఫ్యామిలీలో ఒక్కడైన నూర్ భాయ్ మృతితో మెగా హీరోలు అంతా కూడా తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ ప్రస్తుతం నూర్ భాయ్ చనిపోయిన బాధలో ఉండగా అల వైకుంఠపురంలో సినిమా టీజర్ గురించి ప్రకటించడం ఏమాత్రం కరెక్ట్ కాదని యూనిట్ సభ్యులు నిర్ణయించుకున్నారు.

రెండు రోజుల తర్వాత టీజర్ ను విడుదల చేసే అవకాశం ఉంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు జోడీగా ముద్దుగుమ్మ పూజా హెగ్డే నటించిన విషయం తెల్సిందే. బన్నీ మరియు త్రివిక్రమ్‌ల కాంబినేషన్ లో వచ్చిన 'జులాయి' మరియు 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ సినిమా కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుని హ్యాట్రిక్ దక్కించుకోవడం ఖాయం అంటూ మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.