Begin typing your search above and press return to search.

'ఫేక్' వార్ లో హీరోలపై బుర‌ద ఎందుకు?

By:  Tupaki Desk   |   15 Dec 2019 1:30 AM GMT
ఫేక్ వార్ లో హీరోలపై బుర‌ద ఎందుకు?
X
సినిమా క‌లెక్ష‌న్ల విష‌యంలో.. ప్ర‌చార వీడియోల వ్యూస్ విష‌యంల నిర్మాత‌లు చెప్పే ప్ర‌తిదీ ఫేక్ అంటూ విమ‌ర్శ‌లొస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదంతా ప్ర‌చారార్భాటం అంటూ కొట్టి పారేసేవాళ్లు ఉన్నారు. ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లోనూ దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సినిమా క‌లెక్ష‌న్ల వ‌ర‌కూ లెక్క‌ల్ని ఎగ్జాగ‌రేట్ చేసి చూపిస్తే దానివ‌ల్ల మార్కెట్ లో ఇమేజ్ పెరుగుతుందా? ఆ ప్ర‌య‌త్నాన్ని వ‌దిలేస్తే.. ఇక యూట్యూబ్ వ్యూస్.. ఆన్ లైన్ లైక్స్ అంటూ మ‌నవాళ్లు చేసే ప్ర‌చారంలో నిజం ఎంత‌? ఏది నిజం? ఏది ఫేక్ అంటూ అంతా క‌న్ఫ్యూజన్ నెల‌కొంది. యూట్యూబ్ మాఫియా.. డ‌బ్బుకు అమ్ముడుపోయే వ్య‌వ‌స్థ‌లో ఇదంతా కేవ‌లం అభిమానుల‌తో ఆడే గిల్లికజ్జాలాట‌! అంటూ కొట్టి పారేసేవాళ్లు ఉన్నారు.

ప్ర‌స్తుతం అల్లు అర్జున్ .. మ‌హేష్ ఫ్యాన్స్ మ‌ధ్య‌ వార్ చూస్తుంటే అది కాస్తా హ‌ద్దు మీరిన‌ట్టే అర్థ‌మ‌వుతోంది. ఈ రెండు సినిమాల‌కు సంబంధించిన ప్ర‌చార మెటీరియ‌ల్ ఇప్ప‌టికే వేడెక్కిస్తోంది. సంక్రాంతి కానుక‌గా ఈ రెండు సినిమాలు ఒక‌రోజు తేడాతో రిలీజ‌వుతుండంతో అది కాస్తా పోటీత‌త్వానికి దారి తీసింది. అల వైకుంఠ‌పుర‌ములో.. స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రాల‌కు సంబంధించిన ప్ర‌తి పోస్ట‌ర్.. వీడియోని అభిమానులు అంత‌ర్జాలంలో జోరుగా వైర‌ల్ చేస్తున్నారు. అయితే ఇలా ప్ర‌మోట్ చేసిన వాటికి ఇన్ని వ్యూస్ అన్ని లైక్ లు వ‌చ్చాయి అంటూ నిర్మాత‌లే ప్రచారం చేస్తుండ‌డంతో ఫ్యాన్స్ మ‌ధ్య వార్ మ‌రీ పీక్స్ కి చేరుతోంది.

తాజాగా అల వైకుంఠపురంలో టీమ్ చేసిన ఓ ట్వీట్‌ కు మీనింగ్ ఏమిటో! అంటూ మ‌హేష్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాల్లో డిబేట్ ర‌న్ చేస్తుండ‌డం ఫ్యాన్ వార్ కి దారి తీస్తోంది. ఇటీవ‌లే రిలీజ్ చేసిన అల‌.. టీజర్‌ కు 24 గంటల్లోనే 10మిలియన్ వ్యూస్‌ వచ్చాయి. దాన్ని సోషల్ మీడియా ద్వారా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ రివీల్ చేసింది. అభిమానులు.. టాలీవుడ్‌ ప్రేక్షకుల నుంచి నిజమైన ప్రేమ లభించింది. మాకు మద్దతిచ్చిన అందరికీ థ్యాంక్స్. 10 మిలియన్ రియల్ టైమ్‌ వ్యూస్ తో అల .. టీజర్ యూట్యూబ్‌ లో నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంది. ఇంకా వ్యూస్ కంటిన్యూ అవుతున్నాయి`` అని ట్వీట్ చేసింది.

రియల్ టైమ్ వ్యూస్ అన్న ప్ర‌స్థావ‌న‌కు వ్య‌తిరేకంగా.. మహేష్ ఫ్యాన్స్ #AVPLTeaserFakeViewsతో ఆ ట్వీట్‌ ను ట్రోల్ చేస్తున్నారు. ఇవేం జోకులు అంటూ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు ఇక స‌రిలేరు ప్ర‌చారం విష‌యంలోనూ బ‌న్ని ఫ్యాన్స్ ఇదే తీరుగా జోకులు.. కామెంట్ల‌తో వేడెక్కిస్తున్నారు. ఒక ర‌కంగా దొందూ దొందే అన్న తీరుగా ఈ వార్ న‌డుస్తోంది. ఫ్యాన్స్ మ‌ధ్య సోషల్ మీడియాలో వార్ జ‌ర‌గ‌డం అలా ఉంచితే మ‌ధ్య‌లోకి హీరోల‌ను లాగేస్తూ బూతు ప‌దాల‌తో తిట్టేయ‌డం ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది.