అసలు వైకుంఠపురం.. విలువ 300 కోట్లు!

Thu Jan 16 2020 10:50:04 GMT+0530 (IST)

Ala Vaikunthapuramulo House Value

ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన పెద్ద సినిమాలలో ఒకటి 'అల వైకుంఠపురములో'.  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ప్రేక్షకులను మెప్పించి సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమాలో మెజారిటీ కథ ఒక ఇంట్లోనే జరుగుతుంది.  ఆ ఇంటి పేరే వైకుంఠపురం.  నిజ జీవితంలో ఆ ఇల్లు ఎవరిదో తెలుసా?తెలుగులో ఓ పాపులర్ న్యూస్ ఛానల్ తో పాటు ఇతర ఛానెల్స్ నడిపే ఓ పాపులర్ మీడియా సంస్థ అధిపతి కూతురు గారి సొంత ఇల్లు అని ఫిలిం యూనిట్ సన్నిహిత వర్గాల సమాచారం. ఈ ఇంటి విలువ తెలిస్తే  మనం అవాక్కవ్వక తప్పదు.  ఈ ఇంటి విలువ అక్షరాలా మూడు వందల కోట్ల రూపాయలు.  హైదరాబాద్ లో ఉండే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఇదొకటని సమాచారం.  ఈ ఇంట్లో 'అల వైకుంఠపురములో' సినిమాకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జరిగిందట. ఈ ఇంటిని చూసి అల్లు అర్జున్ ఎప్పుడో ముచ్చట పడ్డారని.. ఇలాంటి ఇల్లే కట్టుకోవాలనే ప్లానింగ్ లో ఉన్నారని అంటున్నారు.

ఏదేమైనా 'అల వైకుంఠపురములో' ఇల్లు మాత్రం ప్రేక్షకులను ముగ్ధులను చేసేస్తుంది. సినిమా కథలో ఈ ఇల్లు భాగంగా ఉండడంతో ప్రేక్షకులకు పరిశీలనగా చూడకపోవచ్చు.. ఒకవేళ చూస్తే మాత్రం ఆ రిచ్ నెస్ కు.. ఆ ఇంటి అందానికి ఫిదా అయిపోవడం ఖాయం.