Begin typing your search above and press return to search.

అంతలోనే బాహుబలి ని క్రాస్ చేశాడా? రిలాక్స్.. ఎలానంటే?

By:  Tupaki Desk   |   13 Jan 2020 6:11 AM GMT
అంతలోనే బాహుబలి ని క్రాస్ చేశాడా? రిలాక్స్.. ఎలానంటే?
X
గడిచిన కొద్ది కాలంగా సామజవరగమన పాట తెలుగు లోగిళ్లలో ఎంతలా మారుమోగిపోతుందో తెలిసిందే. ఇప్పుడు దానికి ఏ మాత్రం తగ్గకుండా సినిమా కూడా సక్సెస్ సొంతం చేసుకున్న టాక్ అంతకంతకూ విస్తరిస్తోంది. ఆ టాక్ నిజమే బాసూ అంటూ.. కలెక్షన్ల ఫిగర్లు కొత్త రికార్డుల దిశగా పరుగులు తీస్తున్నాయి. ఎంత రికార్డులు బ్రేక్ అయితే మాత్రం.. ఎవ్వర్.. నెవ్వర్ బాహుబలిని టచ్ చేయటమా? నో ఛాన్స్ అనే మాట చాలామంది నోట రావొచ్చు.

కానీ.. వాస్తవం ఏమంటే.. ఒకచోట అల వైకుంఠపురము కలెక్షన్లు బాహుబలిని బ్రేక్ చేశాయి. ఇంతకీ అదెక్కడంటారా? అక్కడికే వస్తున్నాం. ఆదివారం విడుదలైన అల వైకుంఠపురములో.. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఓవర్ సీస్ లోనూ కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావటంతో.. ఈ సినిమాను ముందు చూసేందుకు ఎవరికి వారు ప్రయారిటీ ఇస్తున్నారు. అమెరికాలో ఇప్పటికే భారీగా వసూళ్లు తెస్తున్న ఈ మూవీ.. న్యూజిలాండ్ లో ఇప్పటివరకూ ఉన్న రికార్డుల్ని బ్రేక్ చేసినట్లుగా చెబుతున్నారు.

అమెరికాలో ఆదివారం రాత్రి 7.30 గంటల సమయానికి అలవైకుంఠపురములో 476,546 డాలర్లు కలెక్షన్ కొల్లగొడితే.. తర్వాతి స్థానంలో సరిలేరు నీకెవ్వరు 251,473 డాలర్లు.. దర్బార్ 152,230 డాలర్ల వసూళ్లు సాధించినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్ లో ఇప్పటివరకూ మరే తెలుగు సినిమాకు మొదటి రోజు ఇంత భారీగా కలెక్షన్లు రాలేదని చెబుతున్నారు. చివరకు బాహుబలి రికార్డు సైతం బద్ధలైపోయినట్లుగా చెబుతున్నారు.

న్యూజిలాండ్ లో ఇప్పటి వరకూ తెలుగు సినిమా రిలీజ్ అయిన తొలి రోజు సాధించిన అత్యధిక కలెక్షన్ల రికార్డును అల వైకుంఠపురములో తిరిగరాసినట్లుగా చెబుతున్నారు. మూడుప్రాంతాల్లో ఐదు షోలలో అల వైకుంఠపురములో 34,625 డాలర్ల భారీ కలెక్షన్ ను సొంతం చేసుకుంటే..ఇప్పటివరకూ ఉన్న బాహుబలి రికార్డు 21,290 డాలర్లను బ్రేక్ చేసినట్లుగా చెబుతున్నారు. అల వైకుంఠపురము దూకుడు చూస్తుంటే.. డాలర్ల కుండపోత భారీగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.