Begin typing your search above and press return to search.

'అలా ఇలా' సాంగ్: 'స్టాండ్ అప్ రాహుల్' నుంచి క్యూట్ మెలోడీ..!

By:  Tupaki Desk   |   30 July 2021 9:11 AM GMT
అలా ఇలా సాంగ్: స్టాండ్ అప్ రాహుల్ నుంచి క్యూట్ మెలోడీ..!
X
యంగ్ హీరో రాజ్ తరుణ్ - 'జాను' ఫేమ్ వర్షా బొల్లమ్మ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''స్టాండ్ అప్ రాహుల్''. 'కుర్చుంది చాలు' అనేది దీనికి ట్యాగ్ లైన్. శాంటో మోహన్ వీరంకి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే వదిలిన రాజ్ తరుణ్ - వర్ష ఫస్ట్ లుక్స్.. ఇటీవల విడుదలైన సినిమా టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సినిమాలోని 'అలా ఇలా' అనే సాంగ్ లిరికల్ వీడియోని రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ విడుదల చేసి చిత్ర బృందానికి విషెస్ అందించారు.

''అలా ఇలా అనాలని.. ఇలా ఎలా ఉందే.. అవీ ఇవీ వినాలని.. ఇవాళ తోచిందే.." అంటూ సాగిన ఈ పాటకు స్వీకర్ అగస్తి ట్యూన్ అందించారు. దీనికి అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా.. సత్య యామిని - స్వీకర్ అగస్తి ఆలపించారు. ఈ క్యూట్ లవ్ మెలోడీ సాంగ్ శ్రోతలను అలరిస్తోంది. ఇందులో రాజ్ తరుణ్ - వర్ష బొల్లమ్మ జంట అందంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి శ్రీ‌రాజ్ ర‌వీంద్ర‌న్ సినిమాటోగ్రఫీ అందించగా.. రవితేజ గిరిజాల ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా 'స్టాండ్ అప్ రాహుల్' సినిమా రూపొందుతోంది. సిద్ధు ముద్దా సమర్పణలో డ్రీమ్ టౌన్ ప్రొడ‌క్ష‌న్స్ మరియు హై ఫైవ్ పిక్చర్స్ పతాకాలపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. నంద్‌ కుమార్ అబ్బినేని - భ‌ర‌త్ మాగులూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెన్నెల కిషోర్ - మురళి శర్మ - ఇంద్రజ - దేవి ప్రసాద్ - మధురిమ - రాజ్ కుమార్ - తేజో తదితరులు ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషిస్తున్నారు.