ట్రెండీ టాక్: సౌత్ డైరెక్టర్లంటే కిలాడీ ప్రేమ?

Sat Dec 05 2020 15:00:01 GMT+0530 (IST)

Akshay Kumar love on South directors?

కిలాడీ అక్షయ్ కుమార్ కు నేమ్ ని ఫేమ్ ని తీసుకొచ్చిన దర్శకుల్లో అత్యధికులు సౌత్ కు చెందిన వారే. అందుకే సౌత్ దర్శకులంటే అక్షయ్ కి ప్రేమ. కెరీర్ ఆరంభం నుంచి ఆయన దక్షిణాది దర్శకులకు తగిన గౌరవం ఇచ్చి ఎంకరేజ్ చేశారు.  సౌత్ కి చెందిన ప్రియదర్శన్ తో  పలు హిట్ చిత్రాల్ని అందించాడు. శంకర్ 2.0..  ప్రభుదేవాతో సింగ్ ఈజ్ బ్లింగ్.. రౌడీ రాథోడ్ చిత్రాలు చేయగా.. లారెన్స్ తో `లక్ష్మీ బాంబ్` మూవీ చేశారు. అయితే వీరందరిని మించి మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ తో అక్షయ్‌కుమార్ చేసిన చిత్రాలే ఎక్కువ.బాలీవుడ్ లో కామెడీ ఎంటర్ టైనర్ లతో ప్రియదర్శన్ తనదైన ముద్ర వేశారు.  తన అద్భుతమైన ఫిల్మ్ మేకింగ్ స్టైల్ తో కొన్నేళ్లుగా బాలీవుడ్ లో తన ఉనికిని చాటుకున్నారు. బాలీవుడ్ లో ఆయన చేసిన చిత్రాల్లో అత్యధికం కిలాడీ అక్షయ్ కుమార్ తో చేసినవే. హేరా ఫేరి- భగం భాగ్- భూల్ భూలైయా- గరం మసాలా- హంగమా- హల్చల్ వంటి చిత్రాలు వీరి కలయికలో వచ్చినవే.

అక్షయ్ కుమార్ తో దర్శకుడు ప్రియదర్శన్ కు ప్రత్యేక అనుబంధం వుంది. వీరి కలయికలో వచ్చిన ప్రతీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రియదర్శన్ కు కిలాడీ సహకరించినప్పుడల్లా గరం గరం కామెడీ వర్కవుటైంది. హేరా ఫేరి- భాగం భాగ్- గరం మసాలా- భూల్ భులయా- ఖట్టా మీఠా-  దే దనా ధన్ హిట్ చిత్రాలుగా నిలిచి వీరిద్దరి కాంబినేషన్ కున్న ప్రత్యేకతను చాటాయి. `ఖట్టా మీఠా` తరువాత ప్రియదర్శన్ - అక్షయ్ ల కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు. దాదాపు పదేళ్లవుతోంది వీరి కాంబినేషన్ కు బ్రేక్ పడి. దీంతో సోషల్ మీడియాలో అక్షయ్ ఫ్యాన్స్ ప్రియదర్శన్ ఎక్కడ అంటూ మీమ్స్ వదులుతున్నారు. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ సెట్ కావాలని కోరుకుంటున్నారు. ప్రియదర్శన్ తర్వాతా అక్షయ్ పలువురు సౌత్ దర్శకుల్ని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ప్రభుదేవా.. శంకర్ .. లారెన్స్ లాంటి దర్శకులకు ఛాన్సులొచ్చాయి. వీళ్ల తర్వాత ఈసారి ఛాన్స్ ఎవరికి దక్కనుంది? అన్నది చూడాలి.