చిమ్మ చీకటిలో ఆటో ఎక్కిన బాంబు

Fri Aug 23 2019 13:51:56 GMT+0530 (IST)

Akshay Kumar and Kiara Spotted In The City After Complete Laxmmi Bomb Shooting

కేవలం అరడజను సినిమాలతోనే స్టార్ హీరోయిన్ స్టాటస్ అందుకుంది కియరా అద్వాణీ. తెలుగులో `భరత్ అనే నేను` బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. హిందీలో ఇటీవలే `కబీర్ సింగ్` లాంటి ఇండస్ట్రీ బ్రేకింగ్ హిట్ లో నటించింది. 300 కోట్ల క్లబ్ చిత్రంలో నటించిన నాయికగా కియరా పేరు మార్మోగిపోతోంది. సరిగ్గా ఇలాంటి ఊపులోనే ఫోర్బ్స్ జాబితాలో సంపన్నుడైన కిలాడీ అక్షయ్ కుమార్ సరసన అవకాశం అందుకోవడం కెరీర్ కి మరింతగా బిగ్ బూస్ట్ అనే చెప్పాలి.అక్షయ్ సరసన `లక్ష్మీబాంబ్` అనే చిత్రంలో నటిస్తోంది కియరా. సౌత్ బ్లాక్ బస్టర్ `కాంచన`కు రీమేక్ ఇది. లారెన్స్ మాస్టార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ముంబై సిటీ ఔట్ స్కర్ట్స్ లో షూటింగ్ ముగించుకుని వెళుతూ అక్షయ్ - కియరా బృందం ఫోటోలకు ఫోజులివ్వడం అవి కాస్తా సామాజిక మాధ్యమాల్లోకి రావడంతో వైరల్ గా మారాయి. ఈ ఫోటోల్లో బూడిద రంగు హూడీ - బ్లాక్ జాగర్స్ లో అక్షయ్ చాలా సింపుల్ గా కనిపించారు. అలాగే కియరా సైతం.. బ్లూ డెనిమ్స్ లో వైట్ ప్రింటెడ్ టీస్ లో అంతే సింపుల్ గా కనిపించింది.

అయితే కియరా చిమ్మ చీకటిలో ఆటో ఎక్కి వెళుతున్న దృశ్యం ఈ ఫోటోల్లో కనిపించింది. అలా చీకటిలో ఆటోలో వెళ్లిపోతూ భాయ్ చెప్పేస్తుంటే కుర్రకారు గుండెల్లో కంగారు పుట్టింది. ఇలా ఆటోలో వెళ్లడం షూటింగ్ లో భాగమా లేక తన ఇంటికి ఇలా ఆటోలో బయల్దేరిందా? అన్నది తెలియాల్సి ఉంది. ఇక లక్ష్మీ బాంబ్ చిత్రాన్ని తుషార్ కపూర్ - షబీనా ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో అమితాబ్ - తుషార్ కపూర్ కీలక పాత్రలు పోషించనున్నారు. 2020లో సినిమా రిలీజ్ కానుంది.