Begin typing your search above and press return to search.

లక్ష్మీబాంబ్​: ట్రాన్స్​జెండర్​తో అక్షయ్​, కైరా ప్రమోషన్లు..

By:  Tupaki Desk   |   19 Oct 2020 11:30 PM GMT
లక్ష్మీబాంబ్​: ట్రాన్స్​జెండర్​తో అక్షయ్​, కైరా ప్రమోషన్లు..
X
అక్షయ్‌ కుమార్, కియారా అడ్వాణీ ప్రధాన పాత్రల్లో ‘లక్ష్మీ బాంబ్‌ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి రాఘవ లారెన్స్‌ దర్శకుడు. ఇప్పటికే ట్రైలర్‌ కూడా విడుదలై ఆకట్టుకుంది. ట్రైలర్​లో అక్షయ్‌ నటన ఆకట్టుకుంటుంది. అమీర్ ఖాన్ కూడా ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రశంసించారు. ‘అక్షయ్​ ఇటువంటి పాత్రను చేయడమే నిజంగా సాహసమే’ అంటూ అమీర్​ వ్యాఖ్యానించారు. మరోవైపు కియారా అందం కూడా చిత్రానికి ప్రధాన ఆకర్షణగా మారనున్నది. దీపావళి కానుకగా నవంబరు 9న డిస్నీ+హాట్‌స్టార్‌ వీఐపీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుందీ చిత్రం. తెలుగులో లారెన్స్‌ కథానాయకుడిగా నటించిన ‘కాంచన’ చిత్రానికి రీమేక్‌గా రూపొందింది. ముని కాంచన సిరీస్ లో ముని, కాంచన, గంగ సినిమాలు తీసి హిట్ కొట్టాడు.

కేప్‌ ఆఫ్‌ గుడ్‌ ఫిల్మ్స్, ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్, షబీనా ఎంటర్‌టైన్‌మెంట్, తుషార్‌ ఎంటర్‌టైన్‌ హౌజ్‌ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. ప్రస్తుతం ఈ సినిమా హీరో హీరోయిన్లు అక్షయ్ కుమార్, కియారా అద్వానీ ప్రమోషన్లను ప్రారంభించారు.ఇందులో భాగంగా వీళ్లు ట్రాన్స్ జెండర్స్​ రైట్స్ కార్యకర్త లక్ష్మీ నారాయణ్ త్రిపాఠిని కలుసుకున్నారు. వీరు లక్ష్మీ నారాయణ్ త్రిపాఠిని ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది వైరల్​ అవుతోంది. ఈ సినిమా హర్రర్-కామెడీతో తెరకెక్కింది. అక్షయ్ కుమార్ ఈ పాత్రను ఎంచుకున్నందుకు అంతా ప్రశంసిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా నవంబర్ 9న డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​లో విడుదల కానుంది.