Begin typing your search above and press return to search.

'బచ్చన్ పాండే' హీరో లుక్కు చేంజ్ చేసారా..??

By:  Tupaki Desk   |   23 Jan 2021 1:30 PM GMT
బచ్చన్ పాండే హీరో లుక్కు చేంజ్ చేసారా..??
X
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. లాక్ డౌన్ ముందు మొదలుపెట్టిన సినిమాలను వరుసగా కంప్లీట్ చేస్తున్నాడు. ప్రస్తుతం అక్షయ్ చేతినిండా పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పటికే రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన సూర్యావంశీ సినిమా గతేడాది విడుదల కావాల్సింది. కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదాపడి ఈ మార్చ్ నెలలో విడుదల కాబోతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఏడాదికి ఒకటి రెండు సినిమాల చొప్పున రిలీజ్ చేస్తే.. అక్షయ్ మాత్రమే రెండుకు పైగా సినిమాలు విడుదల చేస్తుంటాడు. అయితే గతేడాది కూడా రెండు సినిమాలను విడుదల చేయాలనీ అనుకున్నాడు. కానీ థియేటర్స్ మూసి ఉంచడంతో ఓటిటి ద్వారా లక్ష్మిబాంబ్ సినిమాతో సరిపెట్టాడు. కొన్నేళ్ల నుండి బాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు అక్షయ్. ఇక ఇటీవలే బెల్ బాటమ్ సినిమా కంప్లీట్ చేసాడట. లాక్ డౌన్ తర్వాత కంప్లీట్ అయిన బిగ్ మూవీ ఇదేనట.

ఇక మరో సినిమా బచ్చన్ పాండే. గతంలో అనౌన్స్ చేసిన ‘బచ్చన్ పాండే’ సినిమా షూటింగ్‌ను త్వరగా పూర్తి చేస్తున్నాడు అక్షయ్. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ గ్యాంగ్ స్టర్ బచ్చన్ పాండే పాత్రలో కనిపించనున్నాడు. సాజిద్ నడియావాలా నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఫర్హాద్ సాంజీ దర్శకత్వం వహించాడు. అయితే గతేడాది నిర్మాత విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో అక్షయ్ ఎడమ కన్ను దెబ్బతిన్నట్లుగా కనిపించింది. ఇక తాజాగా అక్షయ్ షేర్ చేసిన లుక్ లో కుడికన్ను దెబ్బతిన్నట్లుగా కనిపిస్తుంది. ప్రస్తుతం దీని గురించి ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు నడుస్తున్నాయి. మరి సినిమాలో ఏదైనా మార్పులు చేశారేమో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో అక్షయ్ సరసన కృతిసనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో ముఖ్యపాత్రలో అర్షద్ వార్సీ నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జవనరి 26న విడుదల చేయనున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. కానీ అక్షయ్ లుక్కు చూస్తే కాస్త క్రూరంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. చూడాలి మరి ఎలా అలరిస్తాడో..!